ఎన్నాళ్ళో వేచిన ఉదయం..

Meena Yogeshwar
September 11, 2023

దాసుభాషితం అనే ఒక యాప్ లో మేము కథలు చదివితే విన్నారు. పోటీలు పెడితే ఆడారు. మా కలలను మీరు ప్రోత్సహించారు. మాపై hacker దాడి జరిగితే అర్ధం చేసుకున్నారు. మా కష్టం చెబితే స్పందించారు. అడుగడుగునా మాకు తోడుగా ఉన్నారు.మీకు మంచి యాప్ ను అందించడం మా కనీస కర్తవ్యం.మీకు మంచి యాప్ ను అందిద్దామని ప్రయత్నించి దారుణంగా మోసపోయాం, నష్టపోయాం. మీ చేయూతతో తిరిగి నిలబడగలిగాం. కానీ ...

ఒక వ్యక్తి కల మరొకరికి హాస్యం కావచ్చు. ఒకరి కష్టం మరొకరికి విసుగు తెప్పించవచ్చు. ఒకరి విజయం మరొకరికి కడుపుమంట రగిలించవచ్చు. అలాంటి ఈ లోకంలో, దాసుభాషితం అనే ఒక యాప్ ఎలా పోయినా మనకి ఏమిటిలే అనుకుని మీరందరూ ఎప్పుడో వదిలేసి ఉండవచ్చు. మేము కథలు చదివితే విన్నారు. పోటీలు పెడితే ఆడారు. మా కలలను మీరు ప్రోత్సహించారు. మాపై hacker దాడి జరిగితే అర్ధం చేసుకున్నారు. మా కష్టం చెబితే స్పందించారు. అడుగడుగునా మాకు తోడుగా ఉన్నారు.

అలాంటి మీకు మంచి యాప్ ను అందించడం మా కనీస కర్తవ్యం. దాని కోసం ఇదివరకూ ప్రయత్నించి దారుణంగా మోసపోయాం, నష్టపోయాం. మీ చేయూతతో తిరిగి నిలబడగలిగాం. కానీ ఆ కోరిక మాత్రం మమ్మల్ని వదలలేదు. ఎప్పటికైనా, అంతర్జాతీయ స్థాయి app experience మీకు అందించాలనే కృషి చేస్తున్నాం. ఆ కల ఇన్నాళ్ళకు నిజం అవ్వడం మొదలైంది.

దాసుభాషితం యాప్ Android beta version test version విడుదలైంది. ప్రస్తుతం దాసుభాషితం జీవితకాల సభ్యులు ఈ testing లో పాల్గొంటున్నారు. వారి నుండి feedback లభించిన తరువాత యాప్ నిర్మాణం మరింత త్వరగా, మరింత ముందుకు వెళ్ళబోతోంది. అలాగే అతి త్వరలో ios beta version కూడా testing కోసం విడుదల కాబోతోంది.

మొట్టమొదటిసారి దాసుభాషితం యాప్ ను ఒక తెలుగు సాంకేతిక బృందం రూపొందిస్తోంది. కాబట్టి మన content పై, design పై పూర్తి అవగాహనతో ఈ నిర్మాణం కొనసాగుతోంది. ఎన్నో బాలారిష్టాలు దాటి ఎదుగుతోన్న మా సంస్థ ప్రతి దశలోనూ మాతో కలసి నడుస్తూ, కింద పడిన ప్రతిసారీ తిరిగి నిలబడేందుకు ఊతం అందిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మా కొత్త యాప్ తో చెప్తామని ఆశిస్తున్నాం.

మ్యాన్ ఉమన్ అండ్ చైల్డ్ - విశ్లేషణ

Tap to Listen

Dysfunctional Families. ప్రతీ తరంలోనూ అత్యంత సాధారణమైన, ఎంతో ప్రమాదకరమైన సమస్య. బయట నుండి చూడటానికి ఒక కుటుంబంలో కావాల్సినన్ని పాత్రలు ఉంటాయి. కానీ ఒకరికి మరొకరితో మానసిక అనుబంధం కొరవడుతుంది. ఇలాంటి కుటుంబాలలోని పిల్లలు మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. కొందరు పూర్తిగా insensitive గా మారిపోతారు. తద్వారా తమ మిగిలిన జీవితంలో వచ్చిన బంధాలను కూడా నిలబెట్టుకోలేకపోతారు.

ఎప్పుడూ ఇలాంటి కుటుంబాల ఉనికి ఉంటూనే ఉన్నా, ఈ మధ్య ఈ సమస్య పెరిగిపోతోందంటున్నారు social study experts. అతి వృష్టి, అనావృష్టి అన్నట్టుగా పూర్తిస్థాయి introverts, లేదంటే పూర్తిస్థాయి extroverts తయారవుతున్నారు. కొందరు peer pressure వల్ల ఈ రెండిటిలో ఏదో ఒక దానిలో ఇమడటం అవసరంగా భావించి, దురదృష్టవశాత్తూ తమని తాము ఆ వైపుగా బలవంతంగా నెట్టుకోవడం కూడా జరుగుతోంది. దాని వలన కుటుంబాలలో communication వ్యవస్థ దెబ్బతింటోంది. అలా dysfunctional families పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

ఎరిక్ సీగల్ రాసిన మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ అనే నవల dysfunctional family గా ఇంచుమించు మారబోయి, ఆగిన ఒక కుటుంబం గురించినది. తల్లి, తండ్రి, ఇద్దరు ఆడపిల్లలతో హాయిగా నడుస్తున్న ఒక కుటుంబంలోకి ఒక పిల్లవాడు వస్తాడు. ఆ అబ్బాయి ఎవరు? అతనికీ ఈ కుటుంబానికీ సంబంధం ఏమిటి? అతని రాక వలన ఆ కుటుంబంలో వచ్చిన మార్పు ఏమిటి? కుటుంబంలోని శాంతి హరించుకుపోయే ప్రమాదపు అంచు నుండి ఎవరు కాపాడారు వంటి విషయాలు ఈ వారం విడుదలయ్యే విశ్లేషణలో వినండి. ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమతి మాలతీ చందూర్ గారు ఎప్పటిలాగానే తన కోణం నుండి ఈ నవలను మనకు దర్శింపజేశారు. 

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :