ఆంగ్లంలో ‘I went with my gut feeling’ అంటుంటారు. అక్కడికి ఆ గట్ వచ్చి, చెవిలో చెప్పిందా ఈ నిర్ణయం అనుకునేదాన్ని ఇదివరకూ సరదాగా. నిజంగా మన Gut Bacteria కి మన మానసిక ఆరోగ్యాన్ని influence చేయగల శక్తి ఉందని ఓ మహాత్ముడు చెప్పాడు. 2023లో ఓ శుభసోమవారం నాడు యూట్యూబ్ నాకు Dr.Pal అనే పుణ్యాత్ముణ్ణి పరిచయం చేసింది. ఆయన అమెరికాలో Gastroenterology Specialist గా పనిచేసే తమిళీయుడు. మెడిసిన్ ని హాస్యంలో ముంచి అందిస్తాడు మనకి. అంతటి డాక్టర్ అయ్యుండి కూడా తాను అధిక బరువు ఉండేవాణ్ణని, ఫలానా ఫలానా పద్ధతులలో ఆరోగ్యంగా బరువు తగ్గానని. తద్వారా శారీరిక, మానసిక ఆరోగ్యం కూడా చాలా మెరుగైందని ఆయన వివరించిన వీడియోనే మొదటగా నేను చూసింది.
నాకు, నా జీర్ణకోశానికి చిన్ననాటి నుండి విడదీయరాని వైరం ఉన్న కారణంగా త్వరగానే ఆ వీడియోలకి addict అయిపోయాను. ఒకానొక వీడియోలో Good Gut Bacteria మన పూర్తి మానసిక, శారీరిక ఆరోగ్యానికి మూలకారణం అని చెప్తే నోరెళ్ళబెట్టేశాను. డిప్రెషన్ దగ్గర నుంచి ఎన్నో రకాల మానసిక రోగాలకు థైరాయిడ్, డయాబెటిస్ దగ్గర నుంచి ఎన్నో hormonal రోగాలకు, అల్సర్ దగ్గర నుంచి క్యాన్సర్ వరకూ ఎన్నో శారిరీక రోగాలకు మన జీర్ణాశయంలో ఉండే Gut Bacteriaనే కారణం అని తెలుసుకుని పిచ్చెక్కిపోయింది నాకు. ఎందుకంటే ఐదో క్లాసు చదువుకున్న మా బామ్మ కూడా ఉదరం సకల రోగ మూలం అంటూ చెప్పడం చెవుల్లో మారుమోగింది.
అప్పట్నుంచి ఆ పళనియప్పన్ మాణిక్యం అలియాస్ Dr. Palగారి వీడియోలు చూసి, జీర్ణ సంబంధమైన విషయాలెన్నో తెలుసుకోగలిగాను. అయితే, ఇంకా ఎన్నో సందేహాలు ఉండిపోయాయి. ఎలా? ఎలా? అనుకుంటుంటే మన కూటమి సభ్యులందరికీ ‘రావణాసుర’ పేరుతో చిరపరిచితులైన కార్తీక్ కృష్ణమూర్తిగారు గుర్తుకొచ్చారు. Laproscopic Surgeon and Endoscopist అయిన కార్తీక్ గారు చాలా రోజుల క్రితం తాను Gastroenterology పై మన ప్రసంగంలో మాట్లాడతాను అని మనల్ని సంప్రదించారు.
ఇదే అదను అనుకున్న నేను, వారిని మన ప్రసంగానికి ఆహ్వానించేశాను. అయితే, శనివారం వారికి శెలవు దినం కానందున, Emergency Cases వచ్చే అవకాశం ఉన్నందున శనివారం సాయంత్రం ప్రసంగం పెట్టుకోవడం వీలుగా ఉంటుందని ఒక ఒప్పందానికి వచ్చాం. మీలో చాలామందికి మా ఈ ఒప్పందం ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ, ఏం చేస్తాం అక్కడ నిజంగా బల్ల ఎక్కి ఆపరేషన్ కి సిద్ధంగా ఉన్న పేషెంట్స్ ఎదురు చూడడం కన్నా, మనం కాస్త ప్రసంగం జరుపుకోవడమే మంచిది కదా.

కాబట్టి ‘జీర్ణారోగ్యం’ అనే శీర్షికన, మన ఆరోగ్యాన్ని ఓ అంచనా వేసుకునే అవకాశం ఈ ప్రసంగం ద్వారా వచ్చిందన్నమాట. మనలో మన మాటగా చెప్పాలంటే Free Consultation అనుకోండి ఓ రకంగా. ఈ ప్రసంగంలో Gut Health గురించి, రకరకాల జీర్ణాశయ క్యాన్సర్ల గురించి, జీర్ణాశయ అనారోగ్యం వలన కలిగే ఇతర రోగాల గురించి చర్చించనున్నారు కార్తీక్ గారు. ఏప్రిల్ 5, శనివారం సాయంత్రం 4 గంటల నుండి 6గంటల వరకూ ఈ ప్రసంగం జరగనుంది. మీ కడుపు చల్లగా ఉండాలంటే ఏం చేయాలో ఆరోజు కార్తీక్ గారు వివరిస్తారు. వినేద్దాం. పాటిద్దాం. నాలుగుకాలాలపాటు హాయిగా ఉందాం.
అభినందనలు,
మీనా యోగీశ్వర్.