కుందేలు తెచ్చిన తంటా!

Meena Yogeshwar
June 12, 2023

మౌనం కన్నా స్పందన మంచిది. ఏమనుకుంటారో ఎందుకొచ్చిందేలే అని చెప్పకుండా ఉండేవారికన్నా, నిర్మొహమాటంగా సద్విమర్శ చేసేవారు చాలా మంచి చేస్తారు. అలాంటి సద్విమర్శే దాసుభాషితం నిర్వహిస్తున్న ఆధునిక ఆధ్యాత్మికం సిరీస్ పై వచ్చింది. దాసుభాషితం CEO దాసు కిరణ్ Thought Experiment అని ఒక వీడియో విడుదల చేశారు. మానవులు కూడా దైవ స్వరూపాలే అని నిరూపించాడానికే ఈ Experiment. ఈ Thought Experiment లో ఉపమానంగా ఒక కుందేలుని వాడారు. ఆ కుందేలు తెచ్చిన తంటా ఏమిటో...

రెండు వారల క్రితం దాసుకిరణ్ గారు ఆదిమధ్యాంతరాహిత్యం అనే గుణం మనలోనూ ఉందని, దానిని పరిశీలించడానికి ఒక కుందేలు సహాయం తో thought experiment చేయవచ్చని “మీరు దేవుడే. ఇదిగో సాక్ష్యం!” అనే శీర్షికతో ఒక వీడియో చేశారు.

దీనిని దాసుభాషితం సర్వజ్ఞ ప్లాన్ లేదా జీవితకాల సభ్యత్వం తీసుకున్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాసుభాషితం కూటమి అనే WhatsApp గ్రూప్ లో పంచుకున్నాము. 

మీరు చూడకపోయివుంటే ఆ 3 నిమిషాల వీడియో ఇది.

Tap to See

అది చూసి దాసుభాషితం వాడుకరి ఒక సద్విమర్శ చేశారు. ఆయన ఇలా అన్నారు.  

“ఇవి లోతైన వేదాంత చర్చలు, ఇలా కుందేళ్ళతోనూ కాకరకాయలతోనూ over simplify చేస్తే, మేలు కన్నా, హాని ఎక్కువ…. ఆదిశంకరులు, రామానుజులు, విద్యారణ్యులు వంటి వారు వ్రాసిన భాష్యాలు, వాటికి వివరణలు ఉన్నాయి. ఇవి కాక ప్రముఖ పండితుల YouTube వీడియోలూ ఉన్నాయి. వాటిని ప్రోత్సహించే  సమాచారము, సంభాషణలు మేలని నా అభిప్రాయం. Sorry to be critical. I personally respect and appreciate the great effort Dasubhaashitam is doing. But I also feel one should frankly express opinions. That's fundamental for any organization's success.

మౌనం కన్నా స్పందన మంచిది. ఏమనుకుంటారో ఎందుకొచ్చిందేలే అని చెప్పకుండా ఉండేవారికన్నా, ఇలా నిర్మొహమాటంగా సద్విమర్శలు చేసేవారు చాలా మంచి చేస్తారు. They raise consciousness about that issue. అందుకే వారి స్పందనను తెలిపినందుకు ధన్యవాదాలు చెప్పాము. 


తర్వాత దాసుకిరణ్ గారు, ఈ వివరణ ఇచ్చారు.
--
మీ అభిప్రాయాలు నిర్మొహమాటంగా పంచుకున్నందుకు ధన్యవాదాలు. 

నేను ఈ కమ్యూనిటీని చాలా గౌరవిస్తాను. అందుకే నా సమాధానం విస్తారంగా ఇస్తున్నాను. 

మీ ప్రధాన ఆక్షేపణ నేను మరీ over simplify చేశానని. 

ఆది శంకరులు కూడా ఆ కాలంలో ఉన్న వస్తువులనే ఉపమానాలుగా వాడి, విషయాన్ని సులువుగా చెప్పటానికి ప్రయత్నించారు. వారి శైలికి 'గంభీర-ప్రసన్న' అని కీర్తి. అంటే profound yet pleasing in a manner that is easy to understand అని. 
ఆర్ష బోధ సెంటర్ కు చెందిన స్వామి తదాత్మానంద, ఆది శంకరుల 'ఆత్మబోధ' ప్రకరణ గ్రంథం ను పిల్లల picture book గా వర్ణిస్తారు. ప్రతీ పద్యంలో ఒక సాధారణ రూపకమును (common metaphor) ను వాడి, వేదాంతం అందరికి సులభంగా అర్ధమయ్యే రీతిలో అందించారని ప్రతీతి.

నా thought experiment లో కుందేలు బదులు మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి అంటే, దానికి సంబంధించిన భావాలు విషయాన్ని overwhelm చేసే అవకాశం ఉంటుంది. అందుకే కుందేలునో ఇంకో జంతువునో ఊహించుకోమన్నాను. కాకరకాయ కూడా పనిచేస్తుంది. 

ఏ దేవుడు అని మీరు అడిగారు. ఆసక్తి కలిగించాలని, thumbnail లో 'మీరే దేవుడు' అన్నా, వీడియోలో మొత్తం ఆదిమధ్యాంతరహిత్యం అనే దైవ గుణం గురించే మాట్లాడాను. చివరికి “మీరూ దైవ స్వరూపమే” అన్నాను.

ఇటువంటి thought experiments, Consciousness Studies (దీన్నే మనం వేదాంతం అంటాము) లో కొత్తవి కావు. డగ్లస్ హార్డింగ్ అనే ఆయన అద్వైతం ను అనుభవైక్యం చేయడానికి Having No Head అనే పద్దతిని ప్రతిపాదించాడు. నేను చెప్పిన తరహా over simplification అయితే, ఈయన చెప్పింది Radical అనవచ్చు. 

హార్డింగ్ experiment గురించి ఈ క్రింది వీడియో లో విపులంగా తెలుసుకోవచ్చు.

https://youtu.be/4ZAIB1xjbZM 

"ఇవి కాక ప్రముఖ విద్వాంసుల youtube videos ఉన్నాయి" అని మీరు అన్నారు. 

నిజమే, మనకి ఆధ్యాత్మిక థియరీ కావలిసినంత ఉంది. మన అదృష్టం కొద్దీ వాటిని వివరించే పండితులు మనకున్నారు. లేనిది, (and what I missed myself, is a) practitioner's view. ఆ అంతరాన్ని పూరించాలని నా ప్రయత్నం. 

అపుడు నా అర్హత ఏమిటి అనే ప్రశ్న కలగొచ్చు. దానికి సమాధానం Quora లో ఇచ్చాను. మీకు ఆసక్తి ఉంటే చదవండి. 

దాసుకిరణ్ గారు ‘ఆధునిక ఆధ్యాత్మికం’ అంటూ జవాబు మీద జవాబు ఇచ్చేస్తున్నారు. అసలు ఆధ్యాత్మిక విషయాలు చెప్పడానికి మీ అర్హత ఏమిటి?

https://qr.ae/pvzfnl

ఈ విషయాలు నేను గడ్డం పెంచుకుని, విభూతి పూసుకుని, కాషాయ దుస్తులలో, రుద్రాక్షలు వేసుకుని చెప్తే, ఇంకా అంగీకారయోగ్యంగా ఉండవచ్చు.

But that is exactly the stereotype I want to break.

I want to be a person that ordinary people can relate to.

For too long, we have complicated Vedanta. I want to make it more accessible.

It might take some time for me to earn the trust, but I am not in a hurry. 

Because, I believe that is my life's mission.

ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు. 

🙏

---

ఈ వివరణకు అనుబంధంగా ఈ వారం తన అవేకెనింగ్ అనుభవాన్ని కొంత పంచుకున్న పైన వీడియో విడుదల చేశారు. చూసి మీ అభిప్రాయాలూ వీడియో కామెంట్స్ లో పంచుకోగలరు. 

అసుర విత్తు - విశ్లేషణ

Tap to Listen

ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నామని తెలుసుకోవడానికి ఒక కొలమానం, ఇతరుల పట్ల ఉన్న ద్వేషభావం తగ్గడం. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు సంపూర్ణ ప్రేమమూర్తులు.
మతాల మధ్య ఘర్షణలు అనాదిగా ఉంటున్నవే, మత విద్వేషం ఒక మనిషి జీవితాన్ని ఎలా సమూలంగా మార్చేసిందో తెలిపే నవలను ఈ వారం పరిచయం చేయబోతున్నాం.

ఒక్కొక్కరి జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. ప్రతిరోజూ ఏటికి ఎదురీతలానే సాగుతుంది. ప్రతి మలుపూ, పరిస్థితి మరింత దిగజారడానికే వచ్చింది అన్నట్టు ఉంటుందే తప్ప, ఒక్క ఆశా దీపం కూడా కనపడదు. సమాజం ఇలాంటి వారిని వంచించడానికి, పావుగా వాడుకోవడానికి, ఈసడించుకోవడానికే ఆసక్తి చూపుతుంది. అలాంటి ఒకతని కథే అసుర విత్తు.

తల్లికి చాలా పెద్ద వయసులో పుట్టిన గోవింద కుట్టికి పుట్టుకతోనే కుటుంబం, సమాజం రాక్షస విత్తనం అనే బిరుదు ఇచ్చింది. ఈ అవమానంతో పాటు, పేదరికం కూడా అతన్ని ఆశ్రయించింది. తండ్రి మరణంతో కుటుంబ పోషణ అతని చిన్ని భుజాలపై మోయలేని భారమైంది. ముస్లిం స్నేహితుడు ఉండడం అనే విషయం నేరమై, అతని జీవితాన్ని ఎలా కాలరాసింది అన్నదే ఈ నవల. కూటి కోసం కష్టపడే ఈ గోవింద కుట్టిని ఆ చిన్న ఊరు మత విద్వేషం కోసం ఎలా వాడుకుందో వింటే హృదయం ద్రవించిపోతుంది.

ప్రముఖ మలయాళీ రచయిత, సినీ దర్శకుడు ఎం.టి.వాసుదేవ నాయర్ రాసిన ఈ నవల ఆ కాలంలో, కేరళలో బలంగా పాతుకుపోయిన మత విద్వేషాలు, భూస్వామ్య వ్యవస్థల మూలాలను చిత్రించింది. ఈ నవలపై ప్రముఖ రచయిత్రి, విమర్శకురాలు, కాలమిస్ట్ శ్రీమతి మాలతీ చందూర్ రాసిన విశ్లేషణ ఈ వారం విడుదల అవుతోంది. మలయాళ సాహిత్యం గురించి, వాసుదేవ నాయర్ గురించి ఆమె అభిప్రాయాలు విని తీరాల్సిందే.

Image Courtesy :