నేను ఒక దాసుభాషితం యూసర్ ని కలిసినప్పుడు ఏమైందంటే…

Dasu Kiran
September 18, 2024

రాజశేఖర్ గారు నిఖార్సైన దాసుభాషితం User Archetype. ఆయనలాగే దాసుభాషితం వాడుకరులు ఎక్కువగా హైదరాబాద్, విదేశాల్లో ఉన్నారు. వీరు జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నవారు, ఆంగ్లం బాగా వచ్చినవారు. వీరికి మెరుగైన జీవనం పొందడానికి కావలసిన awareness, access, affordability అన్ని ఉన్నాయి. మరి, తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉండి కేవలం తెలుగు మాత్రమే మాట్లాడే యువత మాటేమిటి? తెలుగు భాషాభిమానంతో పాటు వారికి జీవన నైపుణ్యాలను అందించాలనే భావన ఎప్పటినుంచో నలుగుతోంది. కొందరు వాడుకరులు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కాంటెంట్ మరింత ఎక్కువగా ఉండాలని కూడా సూచించారు. దాసుభాషితం ప్రస్తుతం ఒకవైపు సాహిత్య పరమైన శ్రవణ పుస్తకాలను అందిస్తూనే....

గత వారం దాసుభాషితం వాడుకరి, కూటమి సభ్యుడు శ్రీ తటవర్తి రాజశేఖర్ గారు బెంగళూరుకు వచ్చినప్పుడు డిన్నర్ కి కలిశాం. కుటుంబం, దాసుభాషితం, Calvin & Hobbes, Waking Up App వంటి ఎన్నో అంశాలు చర్చించాము.

Waking Up నా జీవితాన్ని మార్చింది. ఇది ఆ యాప్ వాడిన చాలా మందికి అనుభవమే. ఒక సాధారణ శ్రవణ పుస్తకాల యాప్ నుంచి సమగ్ర శ్రేయస్సు పెంపొందించే యాప్‌గా దాసుభాషితం metamorphose అయ్యిందంటే, దానికి Waking Up ప్రభావం ఉందనడంలో సందేహమే లేదు.

మొన్న "పిల్లల్లో లైఫ్ స్కిల్స్ పెంపుదల" పై శారద అక్కినేని గారి ప్రసంగం అనంతరం, ఒక వాడుకరు దాసుభాషితం యాప్ వాడటం, కూటమిలో భాగం కావడం సత్సంగంలో ఉన్నట్టు అనిపిస్తోందని చెప్పినప్పుడు, *Waking Up* లాగే, దాసుభాషితం కూడా మెరుగైన జీవితానికి దోహదపడుతున్నందుకు ఎంతో ఆనందించాను.

అయితే Waking Up లా ఆధ్యాత్మికం దాసుభాషితం లో ఒక పార్శ్వం మాత్రమే. తెలుగు వారికి తెలుగు సాహిత్యంతో ఉన్న అనుబంధాన్ని కాపాడడం, భాషా కళలపై ప్రేమను పెంచడం, వృత్తిలో ఎదగడానికి తోడ్పడటం, దాసుభాషితం కు ఉన్న ఇతర పార్శ్వాలు.

రాజశేఖర్ గారు నిఖార్సైన దాసుభాషితం User Archetype. ఆయనలాగే దాసుభాషితం వాడుకరులు ఎక్కువగా హైదరాబాద్, విదేశాల్లో ఉన్నారు. వీరు జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నవారు, ఆంగ్లం బాగా వచ్చినవారు. వీరికి మెరుగైన జీవనం పొందడానికి కావలసిన awareness, access, affordability అన్ని ఉన్నాయి. మరి, తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉండి కేవలం తెలుగు మాత్రమే మాట్లాడే యువత మాటేమిటి?

తెలుగు భాషాభిమానంతో పాటు వారికి జీవన నైపుణ్యాలను అందించాలనే భావన ఎప్పటినుంచో నలుగుతోంది. కొందరు వాడుకరులు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన కాంటెంట్ మరింత ఎక్కువగా ఉండాలని కూడా సూచించారు. 

ఒకవైపు సాహిత్య పరమైన శ్రవణ పుస్తకాలను అందిస్తూనే, దాసుభాషితం ప్రస్తుతం ఈ రకమైన కాంటెంట్ నిర్మాణంపై దృష్టి సారిస్తుంది. మొన్న నేను ఇచ్చిన *Wishwa Talk* "The Myth of Work Life Balance – Crafting a Life of Fulfilment & Purpose" ఒక ప్రారంభం.

ఈ నెల నుంచే 'ఓ సెలబ్రిటీ, ఓ పుస్తకం' అనే శీర్షికను YouTube లో ప్రారంభిస్తున్నాము. ఇందులో ఒక సెలబ్రిటీతో వారిని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకం గురించి లోతుగా చర్చిస్తాము. ఇది యువతకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం.

యువతకు చేరువయ్యేందుకు YouTube లో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాము. యాప్ లో లేని కాంటెంట్, దాసుభాషితం YouTube ఛానెల్ లో అందుబాటులో ఉంది. ఛానెల్ కు బలం చేకూర్చడానికి Subscribe చేయండి:  

https://www.youtube.com/@Dasubhashitam

దాసుభాషితం కూటమిలో ఇదివరకు యాప్ subscription ధరపై కూడా చర్చ జరిగింది. యువతకు దాసుభాషితం ధర అందుబాటులో ఉండేటట్లు *Daily Pass* ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. రోజుకు కేవలం ₹25 లకు యువత తమ సమయం, ఆసక్తిని బట్టి, దాసుభాషితంలో వారికి కావలసిన కాంటెంట్ ను అతి తక్కువ రుసుముకు వినే అవకాశం కల్పించాలనే ఆలోచన వచ్చింది. ఈ విషయంలో మీ సలహా, అభిప్రాయాలు కోరుతున్నాము.

సాంకేతికంగా యాప్ లో మరిన్ని సౌలభ్యాలు కావాలని మీరు కోరుకుంటున్నారని తెలుసు. అయితే, కొత్త ఫీచర్లు అందించే ముందు, యాప్ స్థిరత్వానికి (stability) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ వారం విడుదలైన 3.6.0 వెర్షన్ కూడా అదే లక్ష్యంతో వచ్చింది. App Store లేదా Play Store కు వెళ్లి కొత్త వెర్షన్‌కి అప్గ్రేడ్ చేసుకోగలరు.

Waking Up లో సామ్ హారిస్ ఇలా అంటారు:  

"We are all here for a very short time. Apart from eating ice cream, changing people’s lives is the whole point of being here."

దాసుభాషితం అంటే తులసీదాస్ గారు, మీనా, ప్రభ, రామ్, నేను మాత్రమే కాదు. దాసుభాషితం అంటే మనందరం. 

ఎందుకంటే మీకూ ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా తెలుగు భాషకు, తెలుగు సమాజానికి మేలు చేయాలనే తలంపు లేకపోతే  మీరు మీ అభిప్రాయాలను సలహాలను మాతో పంచుకోరు. వాటికి మేము విలువనిస్తున్నామని పైన చెప్పిన అనేక విషయాల్లో మీరు గమనించి ఉంటారు.
 ఇలాగే దాసుభాషితం గమనంలో మీరు కీలక పాత్ర నిర్వహిస్తారని ఆశిస్తూ, మీలో మరింత మందిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం కోసం ఎదురుచూస్తాను.

దాసుభాషితం YouTube ఛానల్ కు తప్పక Subscribe చేశారు కదూ. లింక్ మళ్ళీ ఇదిగో

.https://www.youtube.com/@Dasubhashitam

అభినందనలు,

దాసు కిరణ్.

Image Courtesy :