#18 యాప్ కు క్రొత్త మెరుగులు.

Dasu Kiran
July 10, 2020

ఒక తెలుగు యాప్ ను ప్రపంచంలోని ప్రధమ శ్రేణి యాప్ లకు సరితూగేలా నిర్మించాలనే ధ్యేయంలో దాసుభాషితం గత వారం మరో అడుగు ముందుకేసింది. దాసుభాషితం లో ఇప్పటికే 100 పైగా శీర్షికలు (titles) 1000 గంటలకు పైగా కాంటెంట్ ఉన్నదని మీకు తెలుసా?

ఒక తెలుగు యాప్ ను ప్రపంచంలోని ప్రధమ శ్రేణి యాప్ లకు సరితూగేలా నిర్మించాలనే ధ్యేయంలో   దాసుభాషితం గత వారం మరో అడుగు ముందుకేసింది. 

దాసుభాషితం లో ఇప్పటికే 100 పైగా శీర్షికలు (titles) 1000 గంటలకు పైగా కాంటెంట్ ఉన్నదని మీకు తెలుసా?

నవలలు, కథలు, కావ్యాలు, కవిత్వం, ఆధ్యాత్మికం, సంగీతం అనే ఆరు విభాగాలతో మొదలైన దాసుభాషితం, ఆ తరువాత ముఖాముఖీలు, విశ్లేషణలు, జీవిత చరిత్ర, మెంవార్స్, వ్యాసాలు, విద్య, యాత్ర సాహిత్యం వంటి విషయాలను కూడా అందిస్తున్నది. మున్ముందు, సమీక్ష, విమర్శ, ఉపన్యాసం, వ్యంగం వంటి రచనా పద్దతులలోనూ, నాటకం వంటి ఇతర లలిత కళలలోనూ, వికాసం విభాగంలోనూ కాంటెంట్ ను అందించాలనే ప్రణాళిక ఉన్నది.

అయితే శీర్షికలను హోంపేజి లో పెడితే తప్ప సులువుగా కనుగొనే వ్యవస్థ యాప్ లో లేదు. దీనిని సరిదిద్దవలసిన బాధ్యత దాసుభాషితం పై ఉన్నది. ముఖ్యంగా యాప్ లో ఉన్న కాంటెంట్ అంతా వినటానికి నెలకు నికరంగా ₹500 కడుతున్న మహారాజ పోషకుల పట్ల ఈ బాధ్యత మరింత పెద్దది. దీనికి మూడు అంచల పరిష్కారాలను కల్పన (design) చేశాము.

– ఒకటి Content Categories ను విస్తృత పరచి, App Menu లో చూపించటం

– రెండు, Notifications ద్వారా కొత్త, సంబంధిత కాంటెంట్ ను సూచించటం 

– మూడు, Search functionality ని మెరుగు పరచడం 

ఈ దఫా యాప్ update లో పైన పేర్కొన్నవాటిలో ఒకటి, రెండు పూర్తి అయ్యాయి. మీరు యాప్ ను అప్డేట్ చేసుకొని యాప్ మెనూ లోకి వెళ్లి Audiobooks ను టాప్ చేస్తే, యాప్ లో ఉన్న కాంటెంట్ అంతా కొత్త వర్గీకరణలో చూడగలుగుతారు. Update ఆప్షన్ కనబడకపోతే, కొన్ని రోజులు వేచి ఉండండి. Google / Apple, Updates ను దఫాల వారీగా విడుదల చేస్తాయి.

తిరుమల లీలామృతం

Tirumala Leelamrutam
Tap to listen.


నాణ్యత విషయంలో ముందుగా సరిద్దినది రికార్డింగ్ ప్రక్రియను. 2019 కి పూర్వం చేసిన రికార్డింగులతో పోల్చితే ఆ తరువాత చేసిన రికార్డింగులలో ఇబ్బందులుండవు. దీనికి కారణం చాలా ఖర్చు పెట్టి మంచి ఎక్విప్మెంట్ ను, అధునాతన Editing Software ను సమకూర్చుకుని, మిక్సింగ్ విధానం మార్చుకోవటమే. వీటి  సామర్ధ్యంతోనే పూర్వపు రికార్డింగ్ల నాణ్యతను పెంచే కసరత్తు చేస్తున్నాము. అలా సంస్కరించిన తిరుమల లీలామృతం గ్రంధాన్ని ఈ వారం పునః విడుదల చేస్తున్నాము. 

దానితో పాటు కాశీ మజిలీ కథలు 8వ సంపుటాన్ని, ప్రఖ్యాత నటులు శ్రీ కోట శ్రీనివాస రావు గారితో గతంలో జరిపిన సంభాషణను, జులై 10న ఆయన జన్మదినం సందర్భంగా విడుదల చేస్తున్నాము.
 

Kota Srinivasa Rao
Tap to Listen


ఈ ముఖాముఖీలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటులు ఎందుకు స్థిర పడతారో అన్న విషయం మీద, “అహ నా పెళ్ళంట” చిత్రంలో తన పాత్రని ఉటంకిస్తూ ఒక నటుడికి నటన సవాలుగా మారే సందర్భం గురించి, నటులు “చచ్చేంత” కష్టపడి ఎందుకు నటిస్తారో అన్న విషయం గురించి, తెలుగు భాష ఔన్నత్యం గురించి సూటిగా చెబుతారు. 


ఆయనకు దాసుభాషితం జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతుంది.

Photo by Siora Photography on Unsplash

Image Courtesy :