‘ఓ సెలబ్రిటీ ఓ పుస్తకం' YouTube సిరీస్ మొదలైంది.

Dasu Kiran
September 25, 2024

యువతకి మంచి పుస్తకాలని పరిచయం చేయడం "ఓ సెలబ్రిటీ ఓ పుస్తకం"కార్యక్రమం ఉద్దేశం. అది సెలబ్రిటీ చదివిన పుస్తకం అయితే, ఆ పుస్తకం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గురించి సాహితీ అభిమానులకు ముందు నుంచే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆయన అందరికీ తెలిశారు అనడం అతిశయోక్తి కాదు. అయితే, ఈ శీర్షిక గురించి చెప్పినప్పుడు శ్రేయోభిలాషి ఒకరు ఏమన్నారంటే ...

నమస్కారం, 

గత పొడ్కాస్టులో  ‘ఓ సెలబ్రిటీ ఓ పుస్తకం' శీర్షిక గురించి చెప్పాను. 

స్టార్టప్ లో ఉండే సౌలభ్యం ఏమిటంటే, ఒక ఆలోచన వస్తే దాని మంచి చెడ్డలు బేరీజు వేసుకుని వెంటనే మొదలు పెట్టవచ్చు. అదే ఒక పెద్ద సంస్థలో అయితే, ప్రపోసల్ పెట్టి, నలుగురితో చర్చించాలి. పక్కన ఉన్నవాడి భయాలను, ఈర్ష్యాసూయలను పరిగణనలోకి తీసుకోవాలి. బాస్ అనుమతి తీసుకోవాలి. ఇవన్నీ అయ్యేసరికి కనీసం 6 నెలలు పడుతుంది.
ఈ YouTube సిరీస్ కి బీజం ఈ నెల మొదటి వారంలో పడింది. నెలలో మొదటి శనివారం ప్రసంగం ఉంటుంది కదా, మూడో శనివారం ఏదన్నా ఇంకో కార్యక్రమం ఉండాలనుకున్నాము. అనుకున్నట్టే, మూడో వారాంతానికల్లా మొదటి ముఖాముఖి మీ ముందు ఉంది.

సెలబ్రిటీ ఎందుకు 

యువతకి మంచి పుస్తకాలని పరిచయం చేయడం కార్యక్రమం ఉద్దేశం. అది సెలబ్రిటీ చదివిన పుస్తకం అయితే, ఆ పుస్తకం పైన ఆసక్తి ఎక్కువ ఉంటుంది. 

ఉదాహరణకు, శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గురించి సాహితీ అభిమానులకు ముందు నుంచే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారి వల్లే ఆయన అందరికీ తెలిశారు అనడం అతిశయోక్తి కాదు.   

అయితే, నేను ఈ శీర్షిక గురించి చెప్పినప్పుడు నా శ్రేయోభిలాషి ఒకరు, “సెలబ్రిటీస్ అందరిని అందరు అప్పుడే పిండేసారుగదా” అన్నారు. నిజమే YouTube లో ఇంటర్వ్యూ కాబడని సెలబ్రిటీ ఎవరూ మిగల్లేదు.
కానీ నేను గమనించినది ఏమిటంటే, సెలబ్రిటీలు చదివిన పుస్తకాలపై సెలబ్రిటీలతో లోతుగా మాట్లాడినవారు ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా, అన్ని విషయాలు అవే ఉండే అవకాశం తక్కువ. అదే వాళ్ల జీవిత విశేషాలైతే, అన్ని వీడియోల్లో ఒకే అంశం ఉండవచ్చు.  

ముఖాముఖి శైలి  

ముఖాముఖి శైలి ఎలా ఉండాలనే విషయం మీద కూడా బాగా ఆలోచించాము. దాసుభాషితం బ్రాండ్ లక్షణాలు ఏమిటంటే, Authenticity, Integrity, Mindfulness (AIM). సత్యసంధత, నిబద్ధత, శ్రద్ధ.
ఒక సెలబ్రిటీ చెప్పిన పుస్తకం మేము ముందు చదవకుండా వారితో ఆ పుస్తకంపై చర్చిస్తే, ఈ మూడూ పాటించనట్టే. సెలబ్రిటీని గౌరవించనట్లే. ముఖాముఖి ఆసక్తికరంగా విజ్ఞానదాయకంగా ఉండాలంటే, ముందు మేము ఆ పుస్తకం చదవాలి. అందుకు సమయం కావాలి. అందుకే నెలకి ఒకటే ముఖాముఖి అనుకున్నది.

సెలబ్రిటీ ఎంపిక 

ఇపుడు మొదటి సెలబ్రిటీ ఎవరై ఉండాలి అనేది ప్రశ్న. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, తర్వాత ఆహ్వానింపబడే సెలబ్రిటీలు ముందు ఎవర్ని చేసారు అని ఆరా తీస్తారు.
మొదట ఆహ్వానింపబడే వ్యక్తి మీద, ఇతర సెలబ్రిటీలందరికీ గౌరవం ఉంటే మంచిది.
మొదటి సెలబ్రిటీ ఎంపిక, ముఖాముఖి జరిపిన తీరు నమ్మకం కలిగిస్తే, సెలబ్రిటీలను లైనప్ చేయడం సులువవుతుంది.

మేము మొదటి సెలబ్రిటీ ఎవరై ఉండాలనే విషయం మీద ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకంటే, ఈ శీర్షిక అనుకున్నప్పుడు మొదట మదిలో మెరిసిన వ్యక్తి ఆయనే. ఆయనకు సమాజంలో మంచి పేరు ఉంది. హేమహేమీలకు ఆయన జీవితం, ఆయన ఆలోచనా విధానం, ఆయన దాతృత్వం ఆదర్శం. 

ఆయన ఎవరో కాదు శ్రీ కోడూరు ఈశ్వర వరప్రసాద్ గారు. ఆయనే మన మొదటి సెలబ్రిటీ. ఆయనతో చర్చించిన పుస్తకం ‘విరాట్' . ఇది స్టెఫాన్ ట్స్వైక్ జర్మన్ భాషలో 1922లో రచించిన డీ ఆయ్గెన్ డెస్ ఎవిగెన్ బ్రూడర్స్ (The Eyes of my brother. Forever.) అనే నవలిక కి తెలుగు అనువాదం. అనువదించినవారు శ్రీ పొనుగోటి కృష్ణ రెడ్డి.

ఈ ముఖాముఖీలో మేము స్పృశించిన అంశాలు.

  • ‘విరాట్’ గురించి అసలు ఎలా తెలిసింది.
  • ఎందుకు అంత మనసుకు హత్తుకుంది.
  • విరాట్ పాత్ర విశ్లేషణ
  • హెర్మన్ హెస్సే ‘సిద్ధార్థ’ కు ట్స్వైక్ ‘విరాట్' కు పోలికలు, భిన్నత్వాలు
  • విరాట్ చదివాక ఆలోచనా విధానం ఎలా మారింది.
  • జీవితంలో ఈ పుస్తకం ఏ మార్పులు తీసుకునివచ్చింది.

ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము. చూసి మీ అభిప్రాయాలను పంచుకోండి. కార్యక్రమం లో మీకు నచ్చిన అంశాలు, మెరుగు పరచుకోవలసిన విషయాలు చెప్

అభినందనలు,

దాసు కిరణ్.

Image Courtesy :