కొన్ని రోజులుగా యాప్ పనిచేయకపోవడం మీకు తెలుసు.
సాంకేతిక చికాకులున్న ఉన్న ప్రస్తుత యాప్ స్థానే కొత్త యాప్ ను ఇంకా కొన్ని వారాల్లో విడుదల చేస్తామనంగా, ఒక సంఘటన జరిగింది.
[Please scroll down for English]
ఏమి అయ్యింది.
డేటా మైగ్రేట్ చేసే క్రమంలో యాప్ కూలిపోయింది. 2 నెలల డేటా నష్టం జరిగింది.
మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టు, డేటాబేస్ హాక్ అయ్యిందంటూ మాకు సందేశం వచ్చింది. డేటా చోరీ అయ్యిందని, డబ్బు చెల్లించకపోతే, ఇంటర్నెట్ లో డేటా విడుదల అవుతుందని ఆ సందేశం సారాంశం.
ఇక్కడ డేటా అంటే ఆడియో ఫైల్స్, యూజర్స్ ఈమెయిలు, మొబైల్ నంబర్లు.
యూజర్ల ఆర్ధిక వివరాలు (క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ వంటివి) మేము ఎప్పుడూ తీసుకోము కనుక అవి లీక్ అయ్యే అవకాశం లేదు.
దాని ప్రభావం ఏమిటి.
వెంటనే నిపుణులను సంప్రదించాము. వారు నుంచి తెలిసినవి ఇవి.
జరిగింది సాధారణ ప్రోగ్రామాటిక్ హాక్ అని, ఇది అన్నీ డాటాబేసులకు ఉండే బెడదని, డబ్బు చెల్లించకుంటే, లాభంలేదనుకుని హ్యాకర్లు చోరీ చేసిన డేటాను డిలీట్ చేస్తారని చెప్పారు.
వారు చెప్పినట్టే ఇంటర్నెట్ లో డేటా విడుదలైనట్టు సమాచారం లేదు.
తీసుకున్న చర్యలు.
నిపుణులు సూచన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నాము.
– డేటా సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత యాప్ ను పునరుద్ధరించకూడదని నిర్ణయించాము.
– కొత్త యాప్ నిర్మాణం ను ఇంకా వేగవంతం చేశాము.
– కొత్త యాప్ లో ఎటువంటి 'సెక్యూరిటీ వల్నరబిలిటీ' ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము.
మీ కొనుగోళ్లు, చందాల విషయం.
త్వరలో కొత్త యాప్, నూతన డిజైన్ తో మీ ముందుకు వస్తుంది.
అప్పటివరకు, మీకు దాసుభాషితం యాప్ అందుబాటులో ఉండదు.
మీరు కొన్న శ్రవణ పుస్తకాలు మీకు తిరిగి లభ్యమౌతాయి.
మీ Subscription కూడా పునరుద్దరించబడుతుంది.
యాప్ అందుబాటులోలేని సమయం మీ Subscription కాలానికి జోడించబడుతుంది.
గత రెండు నెలలుగా మీరు విన్న పుస్తకాల సమాచారం మీకు కొత్త యాప్ లో కనబడకపోవచ్చు. ఈ విషయాలై మీరు మమ్మల్ని సంప్రదిస్తే, మేము మీకు సహాయపడగలము.
ముగింపు
మీకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము.
దాసుభాషితం మీద మీరు చూపుతున్న అపారమైన అభిమానం మాకు సదా ప్రేరణ.
ఇంకా మెరుగైన సేవలందించడానికి మమ్మల్ని కంకణబద్ధుల్ని చేస్తుంది.
దాసుభాషితం ఉజ్జ్వల భవిష్యత్తుకు ముందు ఇది చిన్న విరామమే.
మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలతో,
మీ దాసుభాషితం బృందం.
(తులసీదాస్, కిరణ్ కుమార్, సుధా మాధవి, మీనా, ప్రభ, తరుణ్.)
_______
Namaskaram.
You are aware that the Dasubhashitam App has not been working for a few days now. You also know that we are building a new app from the ground up.
What happened?
Given the delicate structure of the current app, we were planning to move to the new app as soon as possible. As we were preparing for migration to the new App, something untoward happened.
The database crashed and we lost about two months of user history with the app. We however have backups of purchase and subscription history.
To make matters worse, in the process of migration, a vulnerability in the existing app has been exploited by a ransomware hacking algorithm. We got a message to pay up a small amount in Bitcoin or risk data being dumped on the Internet.
What is the impact?
The data in question here is Audio file links and users emails and phone numbers.
Since we don't store any financial data, it was never under risk.
Users pay Google/Apple via their billing systems and the companies then pay us.
We consulted experts who said this is a common programatic ransomware attack and the human hacker's attention is drawn only when the ransom is paid. For the threats that are ignored, the program usually deletes the files as it is uneconomical to hold them.
As a pointer to this view, no data has been leaked as far as we know.
Way forward.
- To secure the data and to prevent any further breach, we have decided to shut down the App temporarily.
- We have accelerated work on the new app to release it as soon as possible.
- We are taking the best possible care to prevent any security breach in the future.
We are working hard to put the new app with great new design in your hands as soon as possible.
What about your purchases and subscriptions?
We will restore all purchases and make up for lost subscription time.
Some usage history may be missing. We will assist you if you have any questions in this regard.
We are proud to have Users like you who love the content.
We immensely value your support, understanding, and patience as we strive to improve the overall experience. We renew our commitment to make Dasubhashitam add significant value to your lives.
This is only a short pause in Dasubhashitam's vibrant future.
We'll see you again soon.
Happy Makara Sankranthi to you and your family.
Warm regards,
Dasubhashitam Team.
(Tulasidas, Kiran Kumar, Sudha, Meena, Prabha, Tarun)