ఇది ఒక యథార్థ ఘటన.
కార్లలో Mahindra XUV 700 ఎంతో పేరుంది. ఇప్పుడు బుక్ చేస్తే 6-7 నెలలకు కానీ చేతికి రాదు.
పక్కా ప్రణాళికతో బెంగళూరులో ఒక కుటుంబం ఈ విజయదశమికి కారు డెలివరీ తీసుకున్నారు.
కారు పార్కింగ్ స్పాట్ లోనే ఉంది ఇంకా పూజ కూడా కాలేదు.
12 గంటలు కాక ముందే రెండు పెద్ద రాళ్లు కారు మీద పడి, బోన్నెట్ ధ్వంసం చేశాయి.
ఈ రాళ్లు వాటంతట అవి పడలేదు. ఆ పని 10-12 ఏళ్ళు ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు చేసినది.
పైగా ఇంతకు ముందు మూడు కొత్త కార్లను కూడా ఇలాగే పాడుచేశారు.
ఈ పిల్లలు దిగువశ్రేణి కుటుంబాలకు చెందిన ఆకతాయిలు కాదు, అలాగే వీరు లేమి ఎరుగని అతి సంపన్న కుటుంబానికి చెందినవారూ కాదు.
ఒక ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. వీరి తల్లి తండ్రులు మంచి వారు, సమాజంలో గౌరవం ఉన్న వారు.
ఆ నాలుగు కార్ల రిపేర్‌లకు డబ్బు చెల్లించారు.
కొంత మంది పిల్లల్లో ఇటువంటి 'destructive behaviour' ఉంటే, ఇంకొంత మందిలో ఆత్మనూన్యతా భావం ఉంటుంది. అసలు నలుగురితో కలవలేరు. పిల్లలకు ఉండే సమస్యలలో ఇవి రెండు మాత్రమే. పిల్లలు లేక కొందరు బాధపడుతుంటే, ఉన్నవారికి పిల్లలను ఈ 'కరోనా అనంతర' కాలంలో సమస్య లేకుండా టీనేజ్ దాటించడం ఒక ప్రసహనమే అవుతోంది.
జీవితంలో వేరే ఏ సమస్యలు లేకుండా, ఒక్క పిల్లల ఇబ్బందికర ప్రవర్తనతో బాధపడే తల్లితండ్రులు కోకొల్లలు. పిల్లల ప్రవర్తన జీవితంలో శ్రేయస్సును ప్రభావితం చేస్తుందనేది నిర్వివాదాంశం.
అందుకే ఈ నవంబర్ మొదటి శనివారం (Nov 4, 2023) ప్రసంగాంశం
'పేరెంటింగ్ – శైశవం నుండి కౌమారం వరకు'.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లో Child Psychologist గా ప్రాక్టీస్ చేస్తున్న శ్రీమతి సుధామాధవి, USA లో Remedial Instructor గా పనిచేస్తున్న శ్రీమతి లక్ష్మి భవాని పాల్గొంటారు. దాసు కిరణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమం ఉద్దేశం పిల్లల మనస్తత్వాన్ని ఇంకొంచెం అర్థం చేసుకోవడంలో తల్లితండ్రులకు సహాయపడడం. కౌన్సిలింగ్ విషయంలో భారతదేశం US లలో అవలంబించే పద్దతులను సమీక్షించడం.
వక్తలు ఇద్దరూ దాసుభాషితం శ్రోతలకు పరిచయమే. సుధా గారు భవ్యమైన శైశవం, బాల్యం, కౌమారం శ్రవణ పుస్తకాలను రూపొందించారు.
భవాని గారు జులై 1న "సినిమాలో జావళీలు" మీద ప్రసంగించారు. భవాని గారు ప్రవృత్తి రీత్యా కూచిపూడి నర్తకి, ఆచార్యులు.
కార్యక్రమం Nov 4, 2023, శనివారం ఉ: 9.30 గం. ప్రారంభమవుతుంది.
సాధారణంగా లైవ్ లో పాల్గొనడం కేవలం దాసుభాషితం జీవిత సభ్యులకు మాత్రమే ఉన్న అవకాశం.
అయితే, ఈ సబ్జెక్టు కున్న seriousness ద్రుష్టిలో పెట్టుకుని, మీ సర్కిల్స్ లో ఉన్న పేరెంట్స్ కు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందనుకుంటే
వారినీ మీరు ఆహ్వానించవచ్చు.
ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారందరు మీటింగ్ లింకు పొందడానికి దయచేసి ఈ ఫారం నింపండి.