పెళ్ళంటే నూరేళ్ళ???

Meena Yogeshwar
March 12, 2024

స్నేహితులుగా ఉండడమే దాంపత్యానికి అసలైన కిటుకు. ఆకర్షణ, ఇష్టం, కోపం, నచ్చని విషయాలు ఇవన్నీ స్నేహమనే బంధం ముందు చిన్నవైపోతాయి. మన స్నేహితులను వారిని వారిగా accept చేస్తాం. వారు ఎలాంటి తింగరి పని చేసినా నవ్వుకోగలగడం, ఎంత కోపం తెప్పించినా ‘సర్లే మన ఫ్రెండేగా’ అనుకోవడం, ప్రవర్తన సరిగ్గా లేకపోతే చొరవ తీసుకుని మరీ సరిదిద్దడం, ఇవన్నీ స్నేహం వల్లనే సాధ్యం. చెప్పినంత సులభం కాకపోయినా, మన జీవిత భాగస్వామిని ఆజన్మాంత మిత్రులుగా తీసుకుంటే, సంసారం సుఖంగా సాగిపోతుంది అని ఎందరో పెద్దలు నిరూపించి చూపించారు. కానీ,...

వివాహ సమయంలో వధూవరులిద్దరితో ఒక మంత్రం చెప్పిస్తారు. దాని అర్ధం ఏమిటంటే ‘నా స్నేహితురాలిగా/స్నేహితునిగా జీవితాంతం ఈ వ్యక్తిని స్వీకరిస్తున్నాను’ అని. స్నేహితులుగా ఉండడమే దాంపత్యానికి అసలైన కిటుకు. ఆకర్షణ, ఇష్టం, కోపం, నచ్చని విషయాలు ఇవన్నీ స్నేహమనే బంధం ముందు చిన్నవైపోతాయి. మన స్నేహితులను వారిని వారిగా accept చేస్తాం. 

వారు ఎలాంటి తింగరి పని చేసినా నవ్వుకోగలగడం, ఎంత కోపం తెప్పించినా ‘సర్లే మన ఫ్రెండేగా’ అనుకోవడం, ప్రవర్తన సరిగ్గా లేకపోతే చొరవ తీసుకుని మరీ సరిదిద్దడం, ఇవన్నీ స్నేహం వల్లనే సాధ్యం. చెప్పినంత సులభం కాకపోయినా, మన జీవిత భాగస్వామిని ఆజన్మాంత మిత్రులుగా తీసుకుంటే, సంసారం సుఖంగా సాగిపోతుంది అని ఎందరో పెద్దలు నిరూపించి చూపించారు. కానీ, వివాహాన్ని complicate చేసేసుకుంటున్నాం. నిజానికి  వివాహ వ్యవస్థ దంపతులతో మొదలై, కుటుంబం, సమాజంగా ఎదగాలి అనే ఉద్ధేశ్యంతో ఏర్పాటైంది. కానీ మొదలవ్వడమే బంధువులు, తల్లిదండ్రుల గొడవలు, పట్టింపులు, రోషాలు, పై చేయి సాధించడాలు వంటి తగాదాలతో అవుతోంది చాలా సందర్భాలలో. 

కట్నాలు, గౌరవాలు, మర్యాదలు వంటి విషయాలలో ఇరు కుటుంబాల మధ్య తగాదాలనే bagaggeతో మొదలవుతున్నాయి ఎన్నో దాంపత్యాలు. ఆ దాంపత్యం నుండి పుట్టే చేదు సమజానికి కూడా హానికరమే. ‘అల్లుడు అంటే బెట్టు చేయాలి’, ‘కోడలు అంటే నోరెత్తకూడదు’ లాంటి conditionings కారణంగా ఒకరి కుటుంబంతో మరొకరు కలిసిపోయే అవకాశం లేకుండా పోతోంది. తద్వారా బంధుత్వం పెరగడం మాట అటుంచి, అసలు మొదలు అవ్వడం లేదు. తన అత్తారింటివైపు వాళ్ళు అంటే అబ్బాయికి గౌరవం ఉండట్లేదు. తన అత్తారింటివైపు వాళ్ళు అంటే అమ్మాయికి ఇష్టం ఉండట్లేదు. 

‘మన కుటుంబం’ అంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే అనే స్థితి చాలా చోట్ల వచ్చేసింది. ఇద్దరి తల్లిదండ్రులూ, బంధువులుగా మిగిలిపోతున్నారే తప్ప, కుటుంబ సభ్యులు కాలేకపోతున్నారు. ఇందులో ఆ భార్యా భర్తల తప్పు ఎంత ఉంటుందో, ఎదుటి కుటుంబాన్ని కలుపుకోవడం నేర్పని తల్లిదండ్రుల తప్పూ అంతే ఉంటోంది. స్నేహితుల్లా ఉండాల్సిన దంపతులు, ఎప్పుడు అవతలివారు తప్పు చేస్తారా? ఎప్పుడు దాడి చేద్దామా అని ఆయుధాలతో సహా సిద్ధంగా ఉన్న శత్రు రాజ్యాల్లా తయారవుతున్నారు. అత్త, మామ, భార్య, భర్త అనేవి బంధాల్లా కాకుండా, అవేవో పదవుల్లా భావిస్తున్నారు.

Tap to Listen

ఈ వారం ప్రముఖ రచయిత, కాలమిస్ట్ శ్రీరమణ గారు రాసిన ‘ప్రేమ పల్లకి’ నవల విడుదల అవుతోంది. ఈ నవలలో భర్త కూడా ‘భర్త అంటే గంభీరంగా ఉండాలి’, ‘అల్లుడు అంటే బెట్టుగా ఉండాలి’, ‘ఎలాంటి విషయాల్లోనూ భార్య సలహా పుచ్చుకోకూడదు’ లాంటి పిచ్చి ఆలోచనలతో దాంపత్యం మొదలుపెడతాడు. ప్రేయసి ఉంటే బాగుండు అని తనకున్న ఒకానొక చిలిపి కోరికను నిజం చేయడానికి పూనుకున్న భార్య, ఆ భర్తకు ఉన్న పిచ్చి ఆలోచనలను ఎలా మార్చింది? దాంపత్యపు అసలైన సరదా ఎలా పరిచయం చేసింది అనేదే కథాంశం. వినండి. బాగుంది. సరదాగా ఉంటుంది. ఆలోచింపజేస్తుంది.

బ్రిడ్జ్ టు ద సన్ - విశ్లేషణ

ఈ వారం విడుదల అవ్వబోయే విశ్లేషణ ‘బ్రిడ్జ్ టు ద సన్’ అనే నవల గురించి. ఈ నవలని గ్వెన్ టెరసాకి అనే అమెరికన్ రచయిత్రి రాశారు. ఈ నవల ద్వారా అన్యోన్య దాంపత్యానికి అర్ధం ఏమిటో తెలుస్తుంది. అమెరికాలో పుట్టి, ఒక జపాన్ రాయబార కార్యాలయ ఉద్యోగస్థుణ్ణి వివాహం చేసుకున్నారు గ్వెన్. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా-జపాన్ మధ్య జరిగిన భీకర యుద్ధంలో ఈ జంట చూసిన కష్టం, అంతటి కష్టంలోనూ ఒకరికొకరు తోడుగా నిలిచిన విధానం వింటే ఆశ్చర్యంగా ఉంటుంది.

రెండు దేశాల మధ్య యుద్ధం అంటే, రెండు దేశాల అధినేతల/రాజకీయ నాయకుల మధ్య యుద్ధం అనే అర్ధం. అందులో ప్రజల పాత్ర అన్యాయంగా నశించడం మాత్రమే, అనే విషయాన్ని తమ అనుభవం ఆధారంగా ప్రపంచానికి తెలియజేయమన్న రచయిత గ్వెన్ భర్త ఆఖరి కోరికకు రూపమే ఈ నవల. తన దేశమైన అమెరికాకు శత్రువు అయినా, భర్త దేశం కాబట్టీ, అతనితో జపాన్ కు వస్తుంది గ్వెన్.

Tap to Listen

తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కనీస భద్రత లేని సమయంలోనూ ఒకరికొకరు సహాయంగా ఉన్న ఆ దంపతులు, యుద్ధం అయిపోయిన తరువాత ఎందుకు విడిపోతారు. అనారోగ్యంగా ఉన్న భర్తను వదిలి, గ్వెన్ అమెరికాకు ఎందుకు వెళ్ళిపోతారు. ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శ్రీమతి మాలతీ చందూర్ గారు ఈ నవలపై చేసిన విశ్లేషణలో ఆర్ధ్రాపూరితమైన ఈ నవల గురించి వినండి.

కూటమి కబుర్లు:

దాసుభాషితం కూటమిలో ప్రతి సోమవారం నేను #మీ_నా_ప్రశ్న అనే శీర్షిక నిర్వహిస్తుంటాను. రచయితల గురించో, రచనల గురించో ఆసక్తికరమైన ప్రశ్న వేస్తుంటాను. మంగళవారం నాడు ఒక చిన్న విశ్లేషణతో సహా ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తుంటాను. ఏ రచయిత గురించి ప్రశ్న అడిగితే, ఆ రచయిత పుస్తకాలను App లో Spotlight లో ఉంచుతాం ఆ వారానికి. ఈ ప్రశ్నకి కూటమి సభ్యుల ఆదరణ ఊహాతీతం. ఎంతో ఇష్టంగా పాల్గొంటుంటారు ఈ శీర్షికలో.

అయితే, ఈ సారి ఉల్టా పల్టా అయిపోయింది. ఈ శనివారం కాకినాడలో వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన సాహితీ సదస్సులో నేను క్విజ్ కార్యక్రమం నిర్వహించాలి. నేను ఇప్పటివరకూ వేసిన మీనా ప్రశ్నలని అక్కడ అడుగుదాం, మన తరహా క్విజ్ ఎలా ఉంటుందో అక్కడి వారికి పరిచయం చేసినట్టు అవుతుంది అని అన్నాను. దానికి దాసుకిరణ్ గారు మరో జోడింపు చేశారు. అదేంటంటే, ‘ఇలా క్విజ్ ఉండబోతోంది, ఇన్నాళ్ళూ నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను, ఇప్పుడు మీరు నాకు ప్రశ్నలు ఇవ్వండి, మీ ప్రశ్నల్ని కూడా కాకినాడ సభలో అడుగుతాను అని సభ్యుల్నే అడుగు’ అని.

నేను ఇలా పోస్ట్ చేశానో లేదో, మన గ్రూపు సభ్యులు కొందరు ప్రశ్నలు పంపారు. అవేం ప్రశ్నలండీ బాబూ, చాలా కష్టంగా ఉన్నాయి. కొన్ని చాలాసేపు ఆలోచిస్తేకానీ సమాధానాలు తట్టలేదు. ఇంకొన్ని అయితే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే, వాళ్ళు ఇచ్చిన హింట్ ల వల్ల చెప్పగలిగాను. ఒకటి, రెండు ప్రశ్నలకి హింట్లు కూడా పని చేయలేదు. వాళ్ళంతట వాళ్ళే సమాధానాలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకి వంగూరి వారి సభలో వచ్చిన సమాధానాలు వచ్చే వారపు న్యూస్ లెటర్లో. సరేనా. ఉంటాను మరి. కాకినాడ వెళ్ళాలి అసలే.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :