శిశుర్వేత్తి.. పశుర్వేత్తి

Meena Yogeshwar
September 25, 2023

శిశువు అంటే కుమారస్వామి - ఆయన సామవేద ప్రియుడు, ఓంకారానికి వ్యాఖ్యానకర్త కదా, పశువు అంటే నందీశ్వరుడు - ఢమరుక శబ్ధం ఆయనకి తప్ప ఎవరికి పూర్తిగా అర్ధం అవుతుంది, ఫణి అంటే శేషుడు - విష్ణువు చేతిలోని శంఖ నాదమే ఆ పరమాత్మను మోయడానికి శేషుడికి శక్తినిస్తోంది అని కొందరు అంటారు. అందుకే వారికి మాత్రమే గానంలోని అసలైన రసం అందుతుంది, కానీ కవి ఉద్దేశించిన తత్త్వం ఈశ్వరుడికైనా అర్ధం అవుతుంది అని చెప్పలేము అని కొందరు వ్యాఖ్యానించారు. ఎవరు వ్యాఖ్యానించినది తీసుకున్నా సంగీతం ప్రపంచ భాష అని, అందులో...

శిశువులు, పశువులు, పాములకు కూడా సంగీతం అర్ధం అవుతుంది. కానీ కవిత్వంలోని తత్త్వాన్ని ఈశ్వరుడైనా అర్ధం చేసుకోగలడా అని ఈ శ్లోకానికి కొందరు ఇలా అర్ధం చెబుతారు.

కానీ, శిశువు అంటే కుమారస్వామి - ఆయన సామవేద ప్రియుడు, ఓంకారానికి వ్యాఖ్యానకర్త కదా, పశువు అంటే నందీశ్వరుడు - ఢమరుక శబ్ధం ఆయనకి తప్ప ఎవరికి పూర్తిగా అర్ధం అవుతుంది, ఫణి అంటే శేషుడు - విష్ణువు చేతిలోని శంఖ నాదమే ఆ పరమాత్మను మోయడానికి శేషుడికి శక్తినిస్తోంది అని కొందరు అంటారు. అందుకే వారికి మాత్రమే గానంలోని అసలైన రసం అందుతుంది, కానీ కవి ఉద్దేశించిన తత్త్వం ఈశ్వరుడికైనా అర్ధం అవుతుంది అని చెప్పలేము అని కొందరు వ్యాఖ్యానించారు. ఎవరు వ్యాఖ్యానించినది తీసుకున్నా సంగీతం ప్రపంచ భాష అని, అందులో రససిద్ధి అంతటి స్థానంలో నిలబెడుతుంది అని అర్ధం అవుతుంది మనకి.

అందుకే కదా త్యాగయ్య అంటాడు ‘సంగీతము, భక్తి వినా సన్మార్గము కలదే మనసా’ అని. త్యాగయ్య దృష్టిలో రససిద్ధి పొందడమే ఆత్మజ్ఞానం. కానీ అలా సంగీతాన్ని అనుభవించి, ఆస్వాదించాలంటే సంగీతం రాని సామాన్యులకు కష్టం కదా. చాలాకాలం నా గురించి నాకు ఒక అభిప్రాయం ఉండేది. నాకు ఒక పాట తీసుకుంటే సాహిత్యం మీద ఉండే శ్రద్ధ, ఆసక్తి సంగీతంపై ఉండవు. నేను ఒక పాట పదే పదే వినేది సాహిత్యాన్ని ఆస్వాదించడానికే అని.

మా బామ్మ ఒక పద్యం చెప్పేది. పూర్తిగా గుర్తు లేదు కానీ, ఈ ముక్క బాగా గుర్తుండి పోయింది. 'రసజ్ఞత ఇంచుక లేకున్న ఆ చదువు నిరర్ధకంబు' అని. అవిడ చాలా పుస్తకాలు చదివేది. భాగవతంలో చాలా ఘట్టాలు కంఠతా వచ్చు. కర్ణాటక సంగీతం నేర్చుకుంది, చాలా బాగా పాడేది. ఆవిడ సంగీత, సాహిత్యాలలో నాకు అబ్బింది కాస్త సాహిత్యం మాత్రమే. సంగీతం బొత్తిగా అందుకోలేకపోయాను. పాడడం తరువాతి సంగతి, ఎవరైనా 'తదరినానా' అంటూ రాగాలాపన మొదలుపెడితే 'సరే bye నానా' అనే రకం నేను. అందుకే సంగీతం ఆస్వాదించడం నాకు రాదు అనే నిశ్చితాభిప్రాయం నాది.

మొన్న ఒకరోజున ఈ అభిప్రాయం పటాపంచలైపోయింది. Instagram లో నిరీక్షణ సినిమాలోని ‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది’ పాట ఈ మధ్య విపరీతంగా trend అవుతోంది. ఆ పాటకి చిన్న చిన్న movements తో steps వేసేవాళ్ళు కొందరు అయితే, తమ చీరల కలెక్షన్ చూపేందుకు ఉపయోగిస్తున్నారు కొందరు. కొంతమంది అయితే తమ travel vlog కి background గా పెట్టుకుంటున్నారు. కొన్ని రీల్స్ లో కేవలం musical bit నే ఉపయోగిస్తున్నారు. ఆ వీడియోల కోసం కాకుండా కేవలం ఆ పాట కోసం ఆ reel thread మొత్తం చూసేశాను నేను. ఇద్దరు మంచి గాయకులు ఈ పాటని తెలుగులో ఒకరు, తమిళంలో ఒకరు పాడుతూ medley చేశారు. దానికి captionలో ఈ పాట ‘కాపీ’ రాగంలో చేశారని తెలిసింది. 

ఆ తరువాత కాపీ రాగంలో ఇంకేం పాటలున్నాయా అని youtube లో వెతుకున్నాను. అప్పుడు suddenగా వెలిగింది నాకు. అదేంటి నేను లిరిక్స్ మొదటి రీల్ లోనే వదిలేసి, సంగీతంలో పడ్డాను, ఆఖరికి రాగంలో తేలాను అని. ఓహో సంగీతాన్ని అర్ధం చేసుకుని, appreciate చేయడంలో స్థాయి బేధం ఉండచ్చు కానీ, అందరిలోనూ సంగీతాన్ని ఆస్వాదించే గుణం ఉంటంది కదా అని. అప్పుడే ఈ సినీ కర్ణాటకం - 2 విడుదల అని తెలిసింది. అందులోనూ కాపీ రాగం ఉంది. ఈ కార్యక్రమం మొత్తం విన్న తరువాత రసజ్ఞత అంటే ఏమిటో కాస్త ఊహ రాసాగింది. ఇలా సంగీతాన్ని అర్ధం చేసుకోవాలి అంటే ఇలాంటి కార్యక్రమాల అవసరం ఉందనిపించింది.

Tap to Listen

సినీ కర్ణాటకం లెసన్ కి ఆధారం దాసుభాషితం జింగిల్ సృష్టికర్త శ్రీ వశిష్ఠ రామ్, గాయని డాక్టర్ సింధుభైరవిల తండ్రి గారు డాక్టర్ వై.శివరామప్రసాద్ గారు రాసిన ‘ఏ గానమో? ఇది ఏ రాగమో?’ పుస్తకం. ఇదివరకూ సినీ కర్ణాటకం మొదటి భాగం విడుదల కాగా, ఇప్పుడు రెండో భాగం వస్తోంది. ఈ రెండు భాగాలు వినండి. సినిమా సంగీతం మన కర్ణాటక సంగీతం నుండి ఎంత inspire అయిందో, ఎందరు గొప్ప సంగీత దర్శకులు మన సంప్రదాయ రాగాలను ఎంత విలక్షణంగా మనకి అందించారో అర్ధం అవుతుంది.

అభినందనలు,

మీనా యోగీశ్వర్.

Image Courtesy :