#09 Mothers' Day వల్ల ప్రయోజనం ఏమిటి?

Dasu Kiran
May 8, 2020

May 10న Mothers' Day. మన జీవితానికి తొలి వెలుగునిచ్చేది అమ్మ. అమ్మని తలచుకోవడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేక రోజు అవసరం లేకపోయినా, ప్రత్యేకంగా చెప్పటానికో, ప్రత్యేక భావాలు స్ఫూరించడానికో ఈ రోజు ఉపయోగ పడుతుంది. అలా అమ్మ మీద, అమ్మతనం మీద...

May 10న MothersDay. మన జీవితానికి తొలి వెలుగునిచ్చేది అమ్మ. అమ్మని తలచుకోవడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి ఒక ప్రత్యేక రోజు అవసరం లేకపోయినా, ప్రత్యేకంగా చెప్పటానికో, ప్రత్యేక భావాలు స్ఫూరించడానికో ఈ రోజు ఉపయోగ పడుతుంది. అలా అమ్మ మీద, అమ్మతనం మీద ఆధునిక కవుల భావఝరులను దోసిళ్ళలో ఒడిసిపట్టి, మనకి హృద్యంగా అందిస్తున్నారు డా. మృణాళిని. ఈ సంచికను మీరు వినటమే కాకుండా, మీ మాతృ మూర్తికి వినిపించి, ధన్యవాదాలు తెలపండి.

పిల్లలకి తెలుగు కథలు తెలియక పోవడానికి అవి అందుబాటులో ఉండకపోవడం కారణం కాకూడదని దాసుభాషితం అభిలాష. నిజానికి కథలు తెలుసుకోవటానికి తల్లి తండ్రులకు, పిల్లలకు శ్రవణం అనువైన మాధ్యమం. అందుకనే శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు తాను వ్రాసిన 'వెలుగు వెన్నెల హారతి' అనే పుస్తకం సూచించగానే, వెంటనే శ్రవణీకరించాలని నిశ్చయించాము.

Velugu Vennela Harathi

ఇక్కడో విషయం చెప్పాలి. దాసుభాషితం కి తెలుగు భాష ఉనికి, అభివృద్ధే పరమావధి. Commercial Viability ఒక సాధనం మాత్రమే. 'అనైతికం' తరువాత, యండమూరి గారి ఇంకో పాపులర్ నవల శ్రవణీకరించవచ్చు. చేస్తాము కూడా. అయితే, అంతగా తెలియని పుస్తకానికి ప్రాధాన్యతని ఇచ్చింది ఎందుకంటే, ఈ పుస్తకం పిల్లల్లో మానసిక వికాసానికి తోడ్పతామే కాకుండా, వారికీ, వారి తల్లితండ్రులకి తెలుగుతో సంబంధాన్ని పెంచుతుంది కాబట్టి.

ఈ కథలు మీకు నచ్చుతాయని మాకు గట్టి నమ్మకం.


ఈ పుస్తకం విడుదలతో పాటు, రచయిత యండమూరి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ముఖాముఖీని కూడా మీకు అందిస్తున్నాము. మన సమాజం వినయానికి ఎంత ప్రాధాన్యతని ఇస్తుందంటే, అది false humility ని కూడా తప్పుపట్టనంత. శ్రీ యండమూరి false prestige, false humility రెంటికీ హారతి పట్టరు. తన బలాలు బలహీనతలు మీద స్పష్టమైన అవగాహన ఉండటం, తాను చేసిన తప్పులు అంగీకరించడంలో ఇగో ను అడ్డురానీయకపోవడం ఆయనలో ఉన్న సద్గుణాలు.

Yandamoori Mukhaamukhee

చకచకా సాగిపోయే ఈ ముఖాముఖీ లో తాను నాటకాలు, నవలలు వ్రాయటం ఎందుకు ఆపేసిందీ, నాలుగు తరహా రచనల గురించి, తన నవలల్లో 'బేవార్స్' నవల గురించి, తన విమర్శకుల మీదనూ, తన అభిప్రాయాలను డా. మృణాళిని గారితో పంచుకున్నారు.

విని ఆనందించండి.

Image Courtesy :