సినీ వట వృక్షానికి విత్తనం సాహిత్యం. 'అతడు నవ్వడు'. ఇది రాక్షసుడు నవలలో కథానాయకుడిని వర్ణిస్తూ యండమూరి వీరేంద్రనాధ్ గారు చెప్పిన వాక్యం. అది చదివిన వెంటనే పాఠకుడు ఒక ఊహా చిత్రాన్ని గీసుకుంటాడు. తనకు తెలిసిన కళ్ళు, ముక్కు, పెదాలను ఒక చోట పెట్టి, వాటిని ఒక మొహానికి అతికించి, అతడు నవ్వనట్టుగా ఉండే ఆ చిత్రాన్ని తన మస్తిష్కంలో చిత్రించుకుంటాడు. ఆ నవలను అదే పేరుతో చిరంజీవి హీరోగా సినిమా తీశారు దర్శకుడు కోదండరామిరెడ్డి. తెర మీద ఈ సన్నివేశాన్ని మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉండదు. చిరంజీవి ముఖం ఈ సన్నివేశాన్ని మనకు చెప్పేస్తుంది.
Read moreట్విట్టర్ లో జరిగిన చర్చ (రచ్చ?) నేపధ్యం లో. 'అమ్మ' ఏ భాషకి చెందిన పదం? అదేమి ప్రశ్న తెలుగే కదా అని అంటాం కదా. కానీ కాదు. అమ్మ అనే పదం ప్రాకృత భాషా కుటుంబానికి చెందిన 'పాళీ' అనే భాష నుండి తెలుగులోకి వచ్చింది. అలాగే తండ్రికి తత్సమమైన 'అయ్య' అనే పదం కూడా పాళీ నుండి తెచ్చుకున్నదే. చాలామంది భాషావేత్తలు వేరే భాషల నుండి వచ్చిన పదాలని ఏరివేసి, అచ్చతెలుగు పదాలను మాత్రమే వాడాలి అని అంటే అది సబబు కాదు. ఎందుకంటే అప్పుడు అమ్మ, అయ్యలను కూడా వదిలేసుకోవాలిగా.
Read moreవ్యక్తిగత, ఆధ్యాత్మిక, సామాజిక అభ్యున్నతికి సోపానాలను చూపించిన దార్శినికుడు, ఎందరికో గురుతుల్యుడు, సంగీత త్రయంలో ముఖ్యుడు అయిన త్యాగరాజు తన కీర్తనల ద్వారా ఈ ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పంచి పెట్టాడు. ఆయన చూపించిన మార్గంలో నడిచి, ఎందరో జనులు త్యాగధనులుగా, కీర్తి తారలుగా ఈ లోకాన నిలిచారు. ఈ గురుపౌర్ణమి నాడు గురుముఖ్యుడు అయిన ఆ మహానుభావుడు చెప్పిన విషయాలను స్మరించుకుందాం.
Read more