దాసుభాషితం నూతన చిహ్నం (లోగో) ఆవిష్కరణ, కథ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం… ఇలా మొదలవుతుంది బిల్వాష్టకం. శివుడి లోనే కాదు, ఈ సృష్టిలో మనకి ఎక్కడ చూసిన త్రయత్వం కనిపిస్తుంది. మూడు ప్రాథమిక రంగులు – ఎరుపు, ఆకుపచ్చ, నీలం మూడు అవస్థలు – జాగృత, స్వప్న, సుషుప్తి మూడు కాలాలు – భూత, వర్తమాన, భవిష్యత్తు మూడు గుణాలు – సత్వం, రజస్సు, తమస్సు మూడు సమయాలు – పగలు, రాత్రి, సంధ్య/వేకువజాము మూడు శరీరాలు – స్థూల, సూక్ష్మ, కారణ ఇలా చెప్పుకుంటూ పొతే చాలా కనిపిస్తాయి మనకు.
Read moreపొన్నియిన్ సెల్వన్ తొలి తెలుగు అనువాదాన్ని శ్రవణ పుస్తకంగా విడుదల చేస్తున్న సందర్భంగా. ఈ భూమి నాది అని ప్రతివారూ అనుకుంటారు. తాను కొన్నాడు కాబట్టి తనది అనుకుంటాడు ఒకడు. తాను పాలించాడు కాబట్టి తనది అనుకుంటాడు మరొకడు. ఈ భూమిలో పుట్టి, ఈ భూమిని ఏలి, తిరిగి ఈ భూమిలోనే కలిసిపోతారు. కానీ ఈ భూమి ఎవడిదీ కాదు. తన మోహ మాయ ఉపయోగించి, ప్రతివాడినీ ఇది నాదీ అనుకోవడం కోసం కొన్నాళ్ళు ఒకరి కింద ఉన్నట్టు నటిస్తుంది ఈ భూమి. వాడి సమయం అయిపోగానే మెల్లిగా తన కడుపులోకి తిరిగి కలిపేసుకుంటుంది.
Read moreభారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ కలం వీరులకు నివాళి. తన తల్లి వినతిని దాస్యం నుండి విముక్తి చేయడానికి గరుత్మంతుడు కష్టపడినట్టు, తమ మాతృభూమిని పరాయి పాలన నుండి రక్షించడానికి ఈ భరత మాత ముద్దు బిడ్డలు ఎందరో పోరాడారు. కొందరు ఆయుధాలతో, కొందరు అహింసా మార్గంలో, మరికొందరు వీరికి స్ఫూర్తిని రగింలించేలా తమ కలాలతో స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆ కవి యోధులను స్మరించుకుందాం.
Read more