ఓ మంచి పాట విన్నప్పుడు, ఆ పాట ఉన్న చిత్రం ఇంకా విడుదల కాకపొతే, ఆ పాటని ఎలా చిత్రకరించారో అనే కుతూహలం ఉంటుంది. చాలా సార్లు చిత్రీకరణ నిరాశ పరుస్తుంది. శ్రోతలకే అలా ఉంటే, సందర్భం, సాహిత్యం, బాణీ కుదిరినప్పుడు, కష్టపడి మంచి పాటను చేస్తే, అది పేలవంగా చిత్రీకరించబడితే, ఆ సంగీత దర్శకుడు ఇంకా ఎంత బాధపడతాడు? కీరవాణిని అలా బాధపెట్టిన పాట, దర్శకుడు ఎవరు? అదే విధంగా, ఒక మంచి పాటని బ్రహ్మాండంగా చిత్రీకరించిన దర్శకుడు ఎవరు?
Read moreతెలుగు వారి ఘనమైన ప్రతీక, భారత మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, సాహిత్య కృషీవలుడు, బహుభాషావేత్త కీ.శే. శ్రీ పీవీ నరసింహారావు గారి శతజయంతి జూన్ 28 న. ప్రపంచ తెలుగు రచయితల సంఘం వారు ఈ వేడుకను ‘తెలుగు భాషా చైతన్యమహోత్సవాలు’ గా నిర్వహించాలని సంకల్పించారు. ఈ సందర్బంగా వారు ప్రచురించిన కర పత్రికలో పీవీ గారి తెలుగు భాషాభిమానం వ్యక్తమయ్యే కొన్ని విషయాలను ఈ విధంగా ప్రస్తావించారు.
Read moreఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల ఆదివారం అనుబంధంలో కథలు చదివే వారికి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి సుపరిచితమైన పేరు. జీవితంలోని సాధారణ ఘట్టాల్లోనుంచి హాస్యాన్ని, మజ్జిగ మీద వెన్నని తీసినట్టు అవలీలగా తీసి వడ్డించడంలో విజయలక్ష్మి గారిది అందె వేసిన చేయి. ఉదాహరణకి ‘ఆల్ ఇండియా రేడియో’ కథని వింటే ఆమె హాస్యశైలి ఇట్టే తెలిసిపోతుంది.
Read more