మన గురించి మనకేం తెలుసు?

Meena Yogeshwar
March 28, 2023

సాధారణ మానవ జీవితం 95శాతం మన మనసు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. మన బంధాలు, మన కెరీర్, మన జీవన ప్రమాణాలు వంటి వాటి విషయాలను మన నిర్ణయాత్మక శక్తి నేరుగా ప్రభావితం చేస్తుంది. అంతటి ముఖ్యమైన విషయంలో మన గురించి మనకి ఏం తెలుసు? మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాం? ఎందుకు ఇలాంటి తరహా నిర్ణయాలే తీసుకుంటున్నాం? మన నిర్ణయాలను ఎలాంటి అంశాలు శాసిస్తున్నాయి వంటి విషయాలు ఎలా తెలుస్తాయి. దీనికి సమాధానం....

Read more

దాసుభాషితం పని అయిపోలేదెహె!!

Dasu Kiran
March 20, 2023

దాసుభాషితం పని అయిపోయిందా? అనే సంశయం తో క్యాంపైన్ మొదలుపెట్టాము. 60 లక్షల రూపాయల లక్ష్యం చేరడానికి ఎంత సమయం పడుతుందో, అసలు ఎంత సమకూరుతుందో కూడా మాకు తెలియదు. మీ అందరి సహయోగంతో ఇపుడు 4 నెలల్లోనే 80 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాము. దాసుభాషితం భవిష్యత్తుకు ప్రమాదం తప్పింది. ఇది ఖచ్చితంగా విజయమే. ఇపుడు ఒక ఆశావహ దృక్పధంతో భవిష్యత్తును చూస్తున్నాము. ఒక వైపు కొత్త కాంటెంట్ విడుదల చేస్తూనే, కస్టమర్ సర్వీస్, న్యూస్లెటర్ విషయంలో మమ్మల్ని మేము మెరుగు పరచుకున్నాము. దాసుభాషితం ప్రసంగాలు వంటి కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించాము. ముఖ్యంగా, ఆప్ పునర్ నిర్మాణం ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా...

Read more

కాళిదాసాదులు ఇచ్చిన అమృతాన్ని పారేసుకుందామా..?

Meena Yogeshwar
March 14, 2023

ఒక యువకుడు తాను కూర్చున్న కొమ్మని నరుకుతున్నాడు. రాజుపై కోపం కలిగిన ఒక పండితుడు ఇతణ్ణి తీసుకువెళ్ళి, మాహా విద్వాంసుడని అబద్ధం చెప్పి, రాకుమార్తెకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. మొదటి రాత్రి భార్య అతణ్ణి పలకరిస్తూ ‘అస్తి కశ్చిత్ వాగ్ విశేషః’ అంటే ‘ఏమైనా కబుర్లు/విశేషాలు ఉన్నాయా’ అందిట సాహితీ చర్చకు ప్రారంభంగా. ఆయన బుర్ర గోక్కుని తనకేమీ రాదని చెప్పాడట. ఎంతో ఆశాభంగం అయిన భార్య, ఆ జగదంబను వేడుకుంటే కనీసం మాట్లాడడమైనా వస్తుంది అని భర్తకు ఉపదేశించింది.ఆ అమ్మ ఆలయానికి వెళ్ళాడు. మనసు లగ్నం చేసి, ఘోర తపస్సు చేశాడు. సకల విద్యల తల్లి శ్యామలాంబ ప్రత్యక్షమైంది. అతని నాలుకపై బీజాక్షరాలు రాసింది. అంతే...

Read more