మేమందరిని కలిసాము. మేమందిరికీ తెలిసాము.

Ram Kottapalli
January 10, 2025

దాసుభాషితం తరపున మేము ముందు నుండి కూడా యాప్ యూజర్స్ నీ నేరుగా కలవాలని, వారితో మాట్లాడాలని ఆలోచనలతో ఉన్నాము. అందుకు తగిన వేదిక ఈ పుస్తకాల పండగే అవడం ఇంకా బాగా కుదిరింది. 2022 లో మేము నిర్వహించిన స్టాల్ వలన అప్పటికి మేము కొంత మందికే తెలుసు, ఇంకా కొంతమందికి పరిచయం అయ్యాము. జీవితకాల సభ్యత్వం తీసుకుని అప్పుడు దాసుభాషితం యాప్ ని నిలబెట్టిన ఎందరో యూజర్స్ తో ఒక వాట్సాప్ కూటమిని ఏర్పాటు చేసిన విషయం అందిరికీ తెలిసిందే. మొదట మేము నిర్వహించిన బుక్ స్టాల్ కి ఇప్పుడు మేము నిర్వహించిన బుక్ స్టాల్ కి ఎంత తేడా ఉంది! అప్పుడు మేము చిన్న టీమ్ ఇప్పుడు...

Read more

పడమటి సంధ్యా రాగం..

Meena Yogeshwar
January 10, 2025

అమెరికాలోనే కాక, ప్రపంచదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు తెలుగుదనాన్ని అందిస్తూ, వారికి తమ భాష సాహిత్యాలకు దూరం కాకుండా ఎంతో కృషి చేస్తున్న మన వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి కన్నా సరైన వారు ఎవరు అనిపించింది. ప్రవసాంధ్ర జీవనం గురించి ఎన్నో కథలు రాసినవారి నుంచి వినడం కన్నా కిక్ ఇంకేం ఉంటుంది?మీకు తెలియనది ఏముంది? తెలుగువారి కోసం అంటే.....

Read more

పాత్రికేయ రంగం యువతను ఆకర్షిస్తోందా?

Meena Yogeshwar
January 10, 2025

రాజకీయ, సాంస్కృతిక, భాష వంటి విషయాలపై సమగ్రమైన సంపాదకీయాలు అందించిన శ్రీనివాస్ గారికి ఇష్టమైన పుస్తకం ఏమిటి? ఆయనను అత్యంత ప్రభావితం చేసిన ఆ పుస్తకం ఏమిటో తెలుసా? ‘చలం ఆత్మకథ’. ఒకప్పటి సమాజాన్ని, సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన చలం జీవితమే శ్రీనివాస్ గారి ముఖ్యమైన ప్రభావం. చలాన్ని నిషిద్ధ రచయితగా భావించిన ఎన్నో తెలుగు కుటుంబాలలో శ్రీనివాస్ గారి కుటుంబం చేరదు. అన్ని రకాల సాహిత్యం వారికి అతి చిన్న వయసు నుండే అందుబాటులో ఉండడం వలన 14-15ఏళ్ళకే చలాన్ని చదువుకోగలిగారు శ్రీనివాస్ గారు.ఇంతటి సాహిత్యం వీరికి అందుబాటులో ఉండడానికి కారణం ...

Read more