తరతరాల నుండి దాంపత్యం సమాజాన్ని ఎంతగా నిలబెడుతోందో, ఎప్పటికీ మారని ఒక నిత్య నూతన సత్యంగా ఎలా ఉందో, అంతే స్థాయిలో సమస్యాత్మకంగా కూడా ఉంది. ఎందరు స్త్రీ, పురుషులు ఈ సమాజం నిర్మించిన ఉక్కు పిడికళ్ళ లాంటి కట్టుబాట్ల కింద నలిగిపోయారో మనందరికీ తెలుసు. పెళ్ళి అనేది ఎప్పుడూ ప్రధానంగా ఇద్దరు మనుష్యుల మధ్యన విషయం. వాళ్ళ బంధం ఎంత గట్టిగా ఉంటే, అది తమ చుట్టూ వారిని అంతగా కలిపి ఉంచగలుగుతుంది. అదే లోపించినప్పుడు...
Read moreతోటి మనిషిని చంపాలంటే మనసులో ఎంత కర్కశం ఉండాలి? అది కూడా అకారణంగా, వాళ్ళు మనకి ఏ హానీ చేయనివారైతే? అందులోనూ పసిపాపలైతే? అలాంటిది ఒక జాతి జాతి మొత్తాన్నీ ఈ భూప్రపంచంపై నుంచి తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు ఒకడు. తనదే గొప్ప జాతి అని. తన శరీరంలో ప్రవహించేదే శుద్ధమైన రక్తం అని, కొందరు జాతుల వాళ్ళు కనీసం బతకడానికి కూడా అర్హులు కారు అని. అసలు ఆ జాతిలో పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపం అని. అలా పుట్టినప్పుడే, వాళ్ళు తన చేతిలో చనిపోవడం రాసి పెట్టి ఉందని అనుకునే ఒక దురహంకారుడు చేసిన హత్యాకాండలో....
Read moreమాకు చిన్నప్పట్నుంచీ పద్యాలు అలవాటే. అష్టావధానాలు, శతావధానాలు, పద్య నాటకాలు ఇలా ప్రతీ కళా ప్రదర్శనలకు తీసుకుళ్ళేవారు మా నాన్నగారు. ఆయన పృచ్ఛకునిగా పాల్గొన్నవాటిలోనే కాక, కేవలం మాకు చూపించాలనే ఆశతో, మిగిలిన వాటికి కూడా దూరదూరాలకు తీసుకువెళ్ళేవారు. మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పద్యం వినవస్తూనే ఉండేది. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరధీ శతకం, పోతన భాగవత పద్యాలు, ఆధ్యాత్మ రామాయణం పద్యాలు పాడుకుంటూ పూజకు సిద్ధం చేసుకునేది మా బామ్మగారు. ఎందుకు అమ్మమ్మా ఈ వయసులో నీకు తలస్నానాలు, ఒంటి పూట భోజనాలు, ఇన్నేసి గంటల పూజ అని మా అమ్మ అడిగితే మా బామ్మ...
Read more