ప్రాణం ఖరీదు??

Meena Yogeshwar
August 16, 2024

తోటి మనిషిని చంపాలంటే మనసులో ఎంత కర్కశం ఉండాలి? అది కూడా అకారణంగా, వాళ్ళు మనకి ఏ హానీ చేయనివారైతే? అందులోనూ పసిపాపలైతే? అలాంటిది ఒక జాతి జాతి మొత్తాన్నీ ఈ భూప్రపంచంపై నుంచి తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు ఒకడు. తనదే గొప్ప జాతి అని. తన శరీరంలో ప్రవహించేదే శుద్ధమైన రక్తం అని, కొందరు జాతుల వాళ్ళు కనీసం బతకడానికి కూడా అర్హులు కారు అని. అసలు ఆ జాతిలో పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపం అని. అలా పుట్టినప్పుడే, వాళ్ళు తన చేతిలో చనిపోవడం రాసి పెట్టి ఉందని అనుకునే ఒక దురహంకారుడు చేసిన హత్యాకాండలో....

Read more

తడిసితిమి సాహితీ వృష్టిన్ ఓ మీనమ్మా..!

Meena Yogeshwar
August 8, 2024

మాకు చిన్నప్పట్నుంచీ పద్యాలు అలవాటే. అష్టావధానాలు, శతావధానాలు, పద్య నాటకాలు ఇలా ప్రతీ కళా ప్రదర్శనలకు తీసుకుళ్ళేవారు మా నాన్నగారు. ఆయన పృచ్ఛకునిగా పాల్గొన్నవాటిలోనే కాక, కేవలం మాకు చూపించాలనే ఆశతో, మిగిలిన వాటికి కూడా దూరదూరాలకు తీసుకువెళ్ళేవారు. మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పద్యం వినవస్తూనే ఉండేది. శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరధీ శతకం, పోతన భాగవత పద్యాలు, ఆధ్యాత్మ రామాయణం పద్యాలు పాడుకుంటూ పూజకు సిద్ధం చేసుకునేది మా బామ్మగారు. ఎందుకు అమ్మమ్మా ఈ వయసులో నీకు తలస్నానాలు, ఒంటి పూట భోజనాలు, ఇన్నేసి గంటల పూజ అని మా అమ్మ అడిగితే మా బామ్మ...

Read more

కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్

Meena Yogeshwar
August 1, 2024

విశ్వనాథ సత్యనారాయణ. అత్యధిక తెలుగు పాఠకుల చేత తప్పుగా అర్ధం చేసుకోబడిన గొప్ప రచయిత. ఆయన రాసే సిద్ధాంతాలపైనే ఎక్కువ మంది దృష్టి పెడతారు. దానిని ఆధారం చేసుకునే ఆయనను అమితంగా ఇష్టపడడమో, పూర్తిగా వ్యతిరేకించడమో చేస్తారు. నిజానికి విశ్వనాథలో మృదువైన సున్నితత్వం, గొప్ప కల్పనా శక్తి ఉన్నాయి. రచయితగా తన పాత్రను కూలంకషంగా అర్ధం చేసుకుని, దాని వైపు నుండి ఆలోచించి, ఇష్టపడి కూడా, ఆ పాత్ర చేసే పనుల బట్టీ దానికి...

Read more