ఓసారి ఓడిపోదాం

Meena Yogeshwar
September 4, 2024

‘సాధారణంగా ధైర్య, సాహసాలకు, విజయానికి హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుంటాం మనం. ఎప్పుడు కష్టం వచ్చినా ఆయన నామం తలచుకుంటాం. అలాంటిది సీతమ్మని వెతికే క్రమంలో ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్నిసార్లు ఓటమిని చవి చూశాడో తెలుసా? ఆఖరికి ఆయన కూడా ఒక సమయంలో Depressionకు లోనై, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. కానీ ....

Read more

పది తరువాత?

Meena Yogeshwar
August 27, 2024

అందరికీ తమ కెరీర్ పై అవగాహన ఉండదు అని కాదు కానీ, చాలా ఎక్కువ శాతం మందికి పూర్తి అవగాహన లేదు అన్నది నిజం. గాలి ఎటు తీసుకువెళ్తే అటు కొట్టుకుపోతూ, ఆ మార్గమధ్యంలో తమకు నచ్చిన చోట ఆగిపోయి, దానినే కెరీర్ అనుకునేవాళ్ళు కోకొల్లలు. తమకు ఉన్న skills గురించి, వాటిని కెరీర్ గా మార్చుకోగలిగిన ఆలోచనా ధోరణిని తరుణ వయస్కుల్లో పెంపొందించడం చాలా అవసరం. అందులోనూ ముఖ్యంగా ఆంత్రపెన్యూరల్ ఆలోచనా విధానాన్ని వాళ్ళల్లో పెంచడం ఇంకా అవసరం. తమ సామర్ధ్యాలపై ఆధారపడి, తమకే కాక మరో నలుగురికి ఉపాధిని కల్పించగలగడం, తద్వారా...

Read more

ప్రేమ పెళ్ళా? పెద్దలు కుదిర్చిన పెళ్ళా?

Meena Yogeshwar
August 20, 2024

తరతరాల నుండి దాంపత్యం సమాజాన్ని ఎంతగా నిలబెడుతోందో, ఎప్పటికీ మారని ఒక నిత్య నూతన సత్యంగా ఎలా ఉందో, అంతే స్థాయిలో సమస్యాత్మకంగా కూడా ఉంది. ఎందరు స్త్రీ, పురుషులు ఈ సమాజం నిర్మించిన ఉక్కు పిడికళ్ళ లాంటి కట్టుబాట్ల కింద నలిగిపోయారో మనందరికీ తెలుసు. పెళ్ళి అనేది ఎప్పుడూ ప్రధానంగా ఇద్దరు మనుష్యుల మధ్యన విషయం. వాళ్ళ బంధం ఎంత గట్టిగా ఉంటే, అది తమ చుట్టూ వారిని అంతగా కలిపి ఉంచగలుగుతుంది. అదే లోపించినప్పుడు...

Read more