మన మనసులో ఒక తీవ్రమైన, ధర్మబద్ధమైన కోరిక ఉంటే, అది మనసా వాచా కర్మణా అనుక్షణం మనల్ని ఆలోచింప చేస్తుంటే అది తీరడానికి, అందుకు మార్గం చూపడానికి, మన ముందు ఉన్న చీకటిని తొలగించి దిశా నిర్దేశం చేయడానికి ఒక గురువు మన ముందు మనం ఊహించని విధంగా దర్శనం ఇస్తారు అని గురువు ని కలిసిన వారి వాక్కు. గురువు దర్శనం ఖచ్చితంగా మానవ రూపంలోనే ఉంటుంది అని లేదు. మన పురోగతికి, మన ఆత్మ విచారణకి, ఆత్మ పరిశీలనలో మనం ముందుకు వెళ్ళడానికి ఒక ఘటన, ఒక ధ్వని, ఒక నామ జపం ఇలా ఏదైనా...
Read moreగేదెల చెరువులో ముక్కు మూసుకుని ఎక్కువ సేపు మునిగి ఉండడం, గుడి కోనేట్లో దిగి ఎక్కువ తామరపూవులు కోయగలగడం, మామిడి చెట్లపై రాళ్ళ దాడి చేసి-పాలేర్ల చేతులకి చిక్కకుండా పళ్ళు దొంగలించగలగడం, వేప చెట్లకు ఉండే తేనెపట్లు కొట్టి తేనె తాగడం, మాగాయి కోసం ఎండబెట్టుకున్న మామిడి ముక్కల ఊటను పావనం చేయడం, ఎదురింటి వారి కోడిని దొంగిలించి - పక్కింటివారి బుట్టలో దాచి వాళ్ళూ వీళ్ళు దెబ్బలాడుకునేలా చేయడం మన చిన్నతనాన్ని గుర్తు చేసే మరిన్ని విషయాలు...
Read moreసాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు మన ఋషులు. తవ్వే కొద్దీ ఊరే ఊటబావి లాంటిది సాహిత్యం. కేవలం ఒక పదంగా కనపడుతున్నా, దాన్ని ఒక వాక్యంలో పొదిగితే ఎంతో అద్భుతంగా ధ్వనిస్తుంది. ఒక భావానికి రూపు కట్టాలన్నా, ఒక ఆలోచనకు ప్రాణం పోయాలన్నా ఒక్క పదం చాలు కొన్నిసార్లు. ఇక ఆ ఒక్క పదంతో వినేవారి దృష్టికోణంలోనే మార్పు వస్తే అదెంతటి అద్భుతం. అలాంటి అద్భుతం ఒక్కసారి చేస్తేనే కవి జన్మ ధన్యం అయిపోతుంది. రాసిన కీర్తనల్లో అత్యధిక భాగం ఇలా ఒక్క పదంతో కొత్త ప్రాణం పోస్తే ఆయన్ని...
Read more