దాసుభాషితం కు వచ్చిన చివాట్లు. ఈ మధ్య ఒకరు దాసుభాషితం ఒక తార రేటింగ్ ఇచ్చి, చివాట్లు పెడుతూ రివ్యూ రాశారు. మేము శ్రవణ పుస్తకాలను ఉచితంగా కాకుండా రుసుముకి అందిస్తూ తప్పు చేస్తున్నామంటూ. ఇటువంటి చివాట్లు అరకొరగానే వచ్చినా, వచ్చినప్పుడు మాత్రం ఈ ధోరణి లో ఉండే Moral confusion ను ఎత్తిచూపాలనిపిస్తుంది.
Read moreఅక్కినేని నాగేశ్వర రావు గొప్ప తెలుగు నటుడు - అనో, నా అభిమాన నటుడు - అనో ప్రారంభిస్తే, ఆయన మీద వ్యాసాన్ని అతి పేలవంగా ప్రారంభించినట్లే. నటన, నాగేశ్వరరావు జీవితంలో ప్రధానాంశం. ఇది నిర్వివాదాంశం. ఆయన సినిమాలు, పాత్రలు, పాటలు వగైరా గురించి ఇప్పటికే మనకి ఏంతో తెలుసు. అందుకే, ఆయన 83వ జన్మదిన సందర్భంగా రికార్డు చేసిన ముఖాముఖీని నేను సినిమా విశేషాల కోసం వినలేదు. అక్కినేని వ్యక్తిత్వం గురించి ఏం తెలుస్తుందా అని విన్నాను.
Read moreసింగీతం శ్రీనివాసరావు గారి మీద రీసెర్చ్ చేస్తుంటే, ఒక చిక్కొచ్చింది. ఆయన వికీపీడియా పేజీ అంతా లింకుల మయం. చదవడం కొంచెం కష్టంగా ఉన్న ఆయన సాధించిన విజయాలు, పొందిన సత్కారాల వివరాలు అబ్బురపరిచాయి. సింగీతం గారి చిత్రాలంటే తెలుగు వారికి ఆదిత్య 369, భైరవ ద్వీపం; తమిళులకు మైఖేల్ మదన కామ రాజన్, అపూర్వ సహోదరగళ్; కన్నడ వారికి హాలు జేను, చలిసువ మోడగళు, భాగ్యదా లక్ష్మి బారమ్మ గుర్తొస్తాయి. కానీ అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుష్పక్, లేదా పుష్పక విమానం.
Read more