“ప్రతీ రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి…” ఈ పదాలు నేను అంటుంటే, background లో పాట బాణీ ఈపాటికి లీలగా మీకు వినిపిస్తూ ఉండుంటుంది. ఆ వెంటనే స్ఫురించే మరో విషయం, ఆ సినిమా పేరు, ఏకవీర. నా చిన్నప్పుడు టీవిలో ఈ చిత్రం చూసినప్పుడు ఏవి అర్థం కాలేదు. కారణం, జానపద చిత్రాల హీరో కాంతా రావు, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడం, చిత్రం పేరే ఏకవీర అవడంతో ఏ అగ్గిపిడుగు, కంచుకోట లా ఉండి, బోలెడన్ని కత్తి యుద్దాలు ఉంటాయనుకుంటే, అంతా ఏడుపే.
Read more1955 లో ఉడన్ ఖొటాల అనే హిందీ చిత్రం విడుదలయ్యింది. ఈ చిత్రానికి నిర్మాత, సంగీత దర్శకుడు, నౌషాద్. ఇది తమిళ్ లో డబ్ చేయబడి, ‘వాన రథం’ గా విడుదలయ్యింది. దీనిలో పాటలు హిందీలో లతా మంగేష్కర్ చేత, తమిళంలో రావు బాలసరస్వతి చేత పాడిద్దామని నౌషాద్ ప్రణాళిక. రావు బాలసరస్వతిని బొంబాయికి రప్పించి రెండు పాటలు రికార్డు చేయించారు..
Read moreవిల్ఫ్రెడో పరేతో. ఈయన 19-20వ శతాబ్దపు పేరెన్నికగన్న ఆర్ధిక శాస్త్రవేత్తలల్లో ఒకరు. అప్పటి ఇటలీ దేశంలో భూస్వామ్యాన్ని వివరిస్తూ, 80 శాతం భూమి కేవలం 20 శాతం ప్రజానీకం చేతుల్లో ఉందని సూత్రీకరించాడు. మేనేజ్ మెంట్ కన్సల్టెంట్ జాన్ జురాన్ ఈ సూత్రాన్ని వ్యాపార రంగానికి అన్వయిస్తూ, దాదాపు 80% అమ్మకాలు 20% కొనుగోలుదారుల నుంచే వస్తాయన్నాడు. దీనికి ఆయన Pareto Principle అని నామకరణం చేసాడు.
Read more