‘పెళ్ళి చేయకుండా చూడు’, ‘దాలిగుంటలో కుక్కలు’, ‘నువ్వులూ-తెలకపిండి’, ‘పైకొచ్చినవాడు’, ‘దేవుడింకా ఉన్నాడు’ ఇలా చెప్పుకుంటూ పోతే వేలకు వేలే. ఆయన పెట్టే పేర్లలో మరో విశేషమేమంటే, చాలాసార్లు పెట్టిన పేర్లు పొరపాటున కూడా కథలో రావు. ఇంకో విశేషమేమంటే కొన్ని మహా వెటకారంగా కూడా ఉంటాయి. ఉదాహరణకి దేవుడింకా ఉన్నాడు కథ మొత్తం చచ్చిపోయిన వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. కథలో దేవుడి ప్రస్తావన మచ్చుక్కి కూడా రాదు. దేవుడికన్నా, చచ్చిపోయిన వాళ్ళే మనుషుల్ని నడిపిస్తున్నట్టు భావించే మనుషుల కథకు ఆయన పెట్టిన పేరు దేవుడింకా ఉన్నాడు. చెళ్ళున చెంప మీద కొట్టినట్టు ఉంటుంది ఆ పేరు, ఆ కథకి.దాదాపుగా కథలన్నీ రచయిత వివరిస్తూ రాసే ధోరణిలోనే ఉంటాయి. ఇది నాకెందుకు నచ్చిందంటే....
Read moreపదిమంది రచయితలకు ఫోన్ చేసి మన దాసుభాషితం పేరు చెప్తే ఒకరో, ఇద్దరో ‘ఆ.. ఆ.. ఆ యాప్ మాకు తెలుసు’ అనేవాళ్ళు. మిగిలినవాళ్ళకి పేరు అర్ధంతో సహా అన్నీ వివరించేదాన్ని. తెలుగులో మొట్టమొదటి ఆడియో పుస్తకాల యాప్ అయినప్పటికీ మెట్రో నగరాల్లోనూ, ఇతర దేశాల్లోనూ దాసుభాషితం యాప్ గురించి తెలిసినంత ఎక్కువగా ఇరు రాష్ట్రాల్లోని మిగిలిన నగరాలు, పట్టణాల్లో పెద్దగా తెలిసేది కాదు. ముఖ్యంగా రచయితలకు. ఎక్కువగా ప్రచురణ సంస్థలు, పత్రికలు తెలిసినంతగా ఆడియో పుస్తకాలపై అవగాహన తక్కువనే చెప్పాలి మొదట్లో వారికి. నెలలు గడిచేకొద్దీ...
Read moreఒక ఖతిని ప్యాకేజీలుగా నిర్మించడానికి 2 నుంచి 3లక్షల రూపాయల వరకూ ఖర్చు అవుతుందిట. ఎన్ని ఎక్కువ సంస్థలు 10 వేల రూపాయలు ఖర్చు పెట్టి font ప్యాకేజీని కొంటే, ఆ కష్టానికి అంత ప్రతిఫలం దక్కుతుంది. కానీ ఎంతమంది కొంటారు ఈ ప్యాకేజీలు? ఈ ఫాంట్ ను pirate చేసి, ఆ మిగిలే డబ్బులు కూడా లేకుండా చేస్తున్నారు. కమర్షియల్ గా ఫాంట్లను వాడుకుని, ఆదాయం సంపాదించేవారు...
Read more