రచనలలో అన్నింటికన్నా తక్కువగా అంచనవేయబడింది అనువాదం. మనకు వచ్చిన ఒక భాషలో నుండి ఇంకో భాషలోకి తర్జుమా చేయడమే కదా అనుకుంటారు చాలామంది. కానీ, ఒక స్థల-కాలాలకు సంబంధించిన ఒక విషయాన్ని, మూల భాష సంస్కృతిని అర్ధం చేసుకుంటూ, రచయిత హృదయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడమే కాక, వారి అభిప్రాయాలను కూడా పూర్తిగా నమ్మి, వేరే రచయిత శైలిని కొనసాగిస్తూ, మన శైలిని రానీయకుండా జాగ్రత్త పడుతూ ఒక్క వాక్యం రాయాలన్నా ఎంత కష్టమో, అనువాదం చేసినవారికే తెలుస్తుంది. పక్కనుండి చూస్తే అర్ధం కాదు. పైగా రచయితగా మనకంటూ ఒక వ్యక్తీకరణ ధోరణి ఉంటుంది. రచనా శైలి ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టాలంటే ...
Read moreమన మనసులో ఒక తీవ్రమైన, ధర్మబద్ధమైన కోరిక ఉంటే, అది మనసా వాచా కర్మణా అనుక్షణం మనల్ని ఆలోచింప చేస్తుంటే అది తీరడానికి, అందుకు మార్గం చూపడానికి, మన ముందు ఉన్న చీకటిని తొలగించి దిశా నిర్దేశం చేయడానికి ఒక గురువు మన ముందు మనం ఊహించని విధంగా దర్శనం ఇస్తారు అని గురువు ని కలిసిన వారి వాక్కు. గురువు దర్శనం ఖచ్చితంగా మానవ రూపంలోనే ఉంటుంది అని లేదు. మన పురోగతికి, మన ఆత్మ విచారణకి, ఆత్మ పరిశీలనలో మనం ముందుకు వెళ్ళడానికి ఒక ఘటన, ఒక ధ్వని, ఒక నామ జపం ఇలా ఏదైనా...
Read moreగేదెల చెరువులో ముక్కు మూసుకుని ఎక్కువ సేపు మునిగి ఉండడం, గుడి కోనేట్లో దిగి ఎక్కువ తామరపూవులు కోయగలగడం, మామిడి చెట్లపై రాళ్ళ దాడి చేసి-పాలేర్ల చేతులకి చిక్కకుండా పళ్ళు దొంగలించగలగడం, వేప చెట్లకు ఉండే తేనెపట్లు కొట్టి తేనె తాగడం, మాగాయి కోసం ఎండబెట్టుకున్న మామిడి ముక్కల ఊటను పావనం చేయడం, ఎదురింటి వారి కోడిని దొంగిలించి - పక్కింటివారి బుట్టలో దాచి వాళ్ళూ వీళ్ళు దెబ్బలాడుకునేలా చేయడం మన చిన్నతనాన్ని గుర్తు చేసే మరిన్ని విషయాలు...
Read more